బీజేపీ, కాంగ్రెస్ దుకాణాలు బంద్ : సీఎం కేసీఆర్

బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని పార్టీ పని అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 01:22 PM IST
బీజేపీ, కాంగ్రెస్ దుకాణాలు బంద్ : సీఎం కేసీఆర్

బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని పార్టీ పని అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు.

వనపర్తి : బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని పార్టీ పని అయిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి 150, కాంగ్రెస్ కి 100 సీట్లు దాటడం లేదని ఢిల్లీ నుంచి వార్త వచ్చిందన్నారు. రెండు పార్టీల దుకాణాలు బంద్ అవుతాయని తెలిపారు. దేశ పరిపాలన వందకు వంద శాతం ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో రాబోతుందన్నారు. స్వయంగా దేశ ప్రధాని ఎన్నికల ముందు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వనపర్తిలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు.
Read Also : రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే

16 ఎంపీలు గెలిచి ఏం చేస్తావు కేసీఆర్ అంటున్నారు? 16 ఎంపీలను గెలిపిస్తే దేశంలోని ఇతర పార్టీలను ఏకం చేస్తానని చెప్పారు. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చానని తెలిపారు. గతంలో పాలించింది కాంగ్రెస్, బీజేపీనే కాదా..అని అన్నారు. గత పాలకుల హయాంలో రాష్ట్రం అభివృద్ధి కాలేదని విమర్శించారు.

తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని తెలిపారు. ఏం జరుగుతుందో ప్రజల కళ్లముందే ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? టీఆర్ఎస్ వచ్చాక రైతులకు ధీమా వచ్చిందన్నారు.
Read Also : క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది