Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రలోభాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆశ్రయిస్తున్నాయి

Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

Slams BJP and Congress: రాజస్థాన్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తుండడం, 100 యూనిట్ల ఉచిత్ విద్యుత్ అందిస్తుండడం ఎన్నికల జిమ్మిక్కని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇలా ఎందుకు చేయలేదని, సరిగ్గా ఎన్నికల ముందే ప్రజల అవసరాలు గుర్తొచ్చాయా అని నిలదీశారు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Viral Video: స్టేజీపై బొక్కబోర్లా పడిపోయిపోన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

‘‘ఇప్పుడు రాజస్థాన్‌లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే వంటగ్యాస్, 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే ఐదేళ్ల క్రితమే ఈ పని చేసి ఉండాల్సింది.


ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రలోభాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆశ్రయిస్తున్నాయి. ప్రజలు వారితో విసిగెత్తిపోయారు.

Delhi: ఎంబీబీఎస్ మరో బీటెక్ అయిపోయిందా? 20 పోస్టులకు క్యూకట్టిన వందల మంది

ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం మొదలైన వాటిని తొలగించి రాష్ట్రాన్ని ఆశించిన అభివృద్ధిని సాధించేందుకు పై నాలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పార్టీల ప్రభుత్వాలకు అవకాశం కల్పించారు. కానీ ఈ పార్టీల ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను విస్మరించాయి. ప్రజలకు తీరని ద్రోహం చేశాయి’’ అని ట్వీట్ చేశారు.