రాష్ట్రంలో అల్లర్లు జరగొచ్చు : ఈసీకి విజయసాయి రెడ్డి లేఖ

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 06:59 AM IST
రాష్ట్రంలో అల్లర్లు జరగొచ్చు : ఈసీకి విజయసాయి రెడ్డి లేఖ

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ముందస్తు భద్రత ఏర్పాటు చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఘర్షణలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చెయ్యాలని విజయసాయి రెడ్డి రాసిన లేఖ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. 80శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని టీడీపీ, వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. మరోసారి గెలుపు ఖాయం అని టీడీపీ అంటుంటే.. ఈసారి విజయం తమదే అని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 19న చివరి విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడిస్తారు.

* కౌంటింగ్ ప్రక్రియకు టీడీపీ ఆటంకం కల్పించే ఛాన్స్ ఉంది.
* ఆటంకాలను అధిగమించేందుకు ఈసీ కఠినంగా ఉండాలి
* కౌంటింగ్ జరిగే వరకు ఎన్నికల అబ్జర్వర్లు కౌంటింగ్ హాల్‌లోనే ఉండాలి
* కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియను ముందుగానే పూర్తి చెయ్యాలి
* కౌంటింగ్ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలి
* కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చెయ్యాలి