Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

Tirumala

Tirumala : తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో ఎటు చూసినా పొడవాటి క్యూలైన్లే దర్శనం ఇస్తున్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారిని దర్శిచుకోవడానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.

వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 నుంచి 36 గంటల సమయం పడుతోంది. అయినప్పటికి భక్తులు తగ్గడం లేదు. తిరుమలకు పోటెత్తుతున్నారు. వేసవి రద్దీ ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Also Read..Chandrababu : రాజధాని పేరుతో జగన్ నాటకాలు.. ఏపీ క్యాపిటల్ అమరావతే : చంద్రబాబు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. క్యూలైన్లలో అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నప్రసాదం, తాగునీరు ఇలా అన్నీ భక్తులకు ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఎటువంటి టోకెన్లు లేకుండా వచ్చే వారికి స్వామి వారికి దర్శనానికి బాగా ఆలస్యం అవుతోంది కాబట్టి.. భక్తులు టోకెన్లు తీసుకుని తిరుమలకు రావాలని సూచించారు. అయినప్పటికీ.. క్యూలైన్లలో వేచి ఉండి సర్వదర్శనానికే భక్తులు మొగ్గు చూపుతున్నారు.