Yadadri Temple : యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి అంకురార్పణ

ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభమైంది.

Yadadri Temple : యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి అంకురార్పణ

Yadadri Temple

Yadadri Temple :  ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభమైంది. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం యాగం నిర్వహిస్తున్నారు రుత్వికులు. వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన వేదపండితులు యాగం చేస్తున్నారు. యాగానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈనెల 28 వరకు ఇది కొనసాగుతుంది.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ,  స్వస్తి పుణ్యహవాచన మంత్రాలతో నారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు అర్చకులు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు. వారం పాటు సాగనున్న పంచకుండాత్మక యాగం.. ఈనెల 28న మహాసంప్రోక్షణ క్రతువుతో పూర్తి కానుంది.

యాగం కోసం బాలాలయంలో ఐదు విధాలుగా కుండాలను ఏర్పాటు చేశారు. తూర్పున చతురస్రాకారంలో, పడమర వృత్తాకారంలో, ఉత్తరంలో త్రికోణం, దక్షిణంలో అర్ధచంద్రాకారం, ఈశాన్యంలో పద్మాకారంలో హోమగుండాలను ఏర్పాటు చేశారు. యాగం కోసం 24 రకాల ద్రవ్యాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నారు. 108 మంది పండితులతో ఏడు రోజులపాటు సాగే పంచకుండాత్మక యాగం తర్వాత మహాకుంభ సంప్రోక్షణ ఈనెల 28న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో మహాక్రతువు ముగియనుంది. తర్వాత ప్రధానాలయంలో మూల విరాట్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గీతారెడ్డి.
Also Read : Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తుపానుగా మారే అవకాశం
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో అంకురార్పణకు ఆలయం సుందరంగా ముస్తాబైంది. గర్భాలయం, ముఖమండపం నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు. ప్రధానాలయం దగ్గర విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దగ్గర  గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపనున్నారు. మహాసంప్రోక్షణ సమయానికి నీరు గండి చెరువులోకి దూకనున్నాయి.

మంగళవారం జరిగే కార్యక్రమాలు: 

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బాలాలయం లో  మంగళవారం  రెండవ రోజు మహా కుంభ సంప్రోక్షణ జరగుతుంది. ఈరోజు ఉదయం శాంతి పాఠం, చతుస్థానార్చన, అగ్ని మథనం,  అగ్ని ప్రతిష్ఠ, పంచకుండాత్మక యజ్ఞం ప్రారంభం అవుతాయి.  సాయంత్రం నిత్య హవనం, బింబ పరీక్ష.. మనోమాన్న శాంతి హోమం, నవకలశ స్నపనం నిర్వహిస్తారు.