TTD : తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

TTD : తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే

Ttd

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. బోర్డు సభ్యుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు.

Read More : Dowry Harassment : సార్‌.. ఎవ్వరినీ వదలొద్దు.. కంటతడి పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్

నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన 25మందికి బోర్డులో సభ్యత్వం లభించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. టీటీడీ పాలకమండలిలో మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావుకు మరోసారి చోటు దక్కింది.

Read More : Anupama Parameswaran: అనుపమా.. అందానికి అదుపు ఎందుకమ్మా..

హెటిరో పార్థసారథిరెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ముంబైకి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. పొలకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డిని సభ్యులుగా నియమించారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‍కు అవకాశం కల్పించారు.గత పాలకమండలిలో 8 మందిగా ఉన్న ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను ఈ సారి ఏకంగా 50 మందికి అవకాశం కల్పించింది టీటీడీ. అయితే వీరికి ఎలాంటి ప్రత్యేక అధికారులు కూడా ఉండవు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.

Click Here:  తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే