Bangladesh vs India: అర్ధసెంచరీలు బాదిన పుజారా, శ్రేయాస్, రవిచంద్రన్ అశ్విన్

బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా తొలి ఇన్నింగ్సు బ్యాటింగును కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 361/7 పరుగులతో క్రీజులో ఉంది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయినా పుజారా, శ్రేయాస్, రవిచంద్రన్ అశ్విన్ అర్ధసెంచరీలు బాదారు.

Bangladesh vs India: అర్ధసెంచరీలు బాదిన పుజారా, శ్రేయాస్, రవిచంద్రన్ అశ్విన్

Bangladesh vs India

Bangladesh vs India: బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా తొలి ఇన్నింగ్సు బ్యాటింగును కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 361/7 పరుగులతో క్రీజులో ఉంది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయినా పుజారా, శ్రేయాస్, రవిచంద్రన్ అశ్విన్ అర్ధసెంచరీలు బాదారు.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేఎల్ రాహుల్ 22, శుభ్‌మన్ గిల్ 20, ఛటేశ్వర్ పుజారా 90, విరాట్ కోహ్లీ 1, రిషబ్ పంత్ 46, శ్రేయాస్ అయ్యర్ 86, అక్షర్ పటేల్ 14 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ 50, కుల్దీప్ యాదవ్ 24 పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3, మెహిదీ హసన్ 2, ఖలెద్ అహ్మద్, ఎదాబత్ చెరో వికెట్ వికెట్ తీశారు.

ఇటీవలే భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రెండు మ్యాచుల సిరీస్ లోనయినా గెలవాలని కసిగా ఉంది. కాగా, టెస్టు మ్యాచుల్లో టీమిండియాపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు.

Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..