AB de Villiers : ఒక శకం ముగిసింది… క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై

ద‌క్షిణాఫ్రికా లెజెండ్ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్‌(అబ్రహం బెంజమిన్ డివిలియర్స్) క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.

AB de Villiers : ఒక శకం ముగిసింది… క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై

Ab De Villiers

AB de Villiers : ద‌క్షిణాఫ్రికా లెజెండ్ క్రికెట‌ర్, మిస్టర్ 36ం.. ఏబీ డివిలియ‌ర్స్‌(అబ్రహం బెంజమిన్ డివిలియర్స్) క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ట్విట్ట‌ర్ లో ఈ విషయాన్ని వెల్ల‌డించాడు. 37 ఏళ్ల వ‌య‌సులో త‌న‌లో ఆడే స‌త్తా అంత‌గా లేద‌న్న రీతిలో కామెంట్ చేశాడు. త‌న కెరీర్‌లో అద్భుత‌మైన జ‌ర్నీ సాగింద‌ని, అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పాడు.

2004లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏబీ అరంగేట్రం చేశాడు. ద‌క్షిణాఫ్రికా తరుఫున 114 టెస్టులు, 228 వ‌న్డేలు, 78 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 20 వేల 14 ర‌న్స్ చేశాడు. టెస్టులు, వ‌న్డేల్లో ఏబీ స‌గ‌టు 50 క‌న్నా ఎక్కువే ఉంది.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

వాస్త‌వానికి అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి 2018 మేలోనే ఏబీ త‌ప్పుకున్నాడు. మూడేళ్లుగా ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు దానికీ గుడ్ బై చెప్పాడు. తాజా రిటైర్మెంట్‌తో ఏబీ ఇక ఆర్సీబీకి కూడా దూరం కానున్నాడు. 2021 ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ త‌ర‌పున డివిలియ‌ర్స్ ఆడాడు. టీ20 కెరీర్‌లో 340 మ్యాచ్‌లు ఆడి.. 150.13 స్ట్ర‌యిక్ రేటుతో 9వేల 424 ర‌న్స్ చేశాడు. 17 ఏళ్లు పాటు ఆడిన ఏబీ 360 డిగ్రీ బ్యాటింగ్ తో క్రికెట్ ను శాసించాడు.

“ఇన్నేళ్ల క్రికెట్ ప్రయాణం నమ్మలేకుండా ఉంది. అయినప్పటికి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నా. ఆనాడు నా స్నేహితులతో బ్యాక్ యార్డ్ మ్యాచులు ఆడిన రోజుల నుంచి ఇప్పటివరకు… ప్రతి గేమ్ ను హద్దుల్లేని ఉత్సాహం, ఆనందంతో ఆడాను. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో ఆ ఫైర్ నాలో ఆ స్థాయిలో ఉన్నట్టు అనిపించడం లేదు” అని ట్వీట్ చేశాడు డివిలియర్స్. ఏబీ ఆటకు గుడ్ బై చెప్పడంతో క్రికెట్ లో ఒక శకం ముగిసిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

* 224 వన్డేలు.. 9వేల 577 పరుగులు
* 114 టెస్టులు.. 8వేల 765 పరుగులు
* 78 టీ20లు.. 1672 పరుగులు
* 22 టెస్టు సెంచరీలు
* 25 వన్డే సెంచరీలు
* ఫాస్టెస్ట్ వన్డే 50, ఫాస్టెస్ట్ వన్డే 100, ఫాస్టెస్ట్ వన్డే 10
* టెస్టు, వన్డే క్రికెట్ లో 50పైన సగటు

నేను సగం భారతీయుడిని..
అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం ఒక వీడియో రిలీజ్ చేశాడు. ”నేను జీవితాంతం ఆర్సీబీయన్ గా ఉండబోతున్నాను. ఆర్సీబీలోని ప్రతి ఒక్కరు నాకు కుటుంబ సభ్యులుగా మారారు. ఎంతోమంది వస్తారు, వెళతారు. కానీ ఆర్సీబీలో మన మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటాయి. నేను ఇప్పుడు సగం భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నా ” అని ఏబీ అన్నాడు.