Team India : భారత క్రికెటర్లకు నోరూరించే ‘మాక్‌డక్’

భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్‌డక్ వడ్డించారు.

Team India : భారత క్రికెటర్లకు నోరూరించే ‘మాక్‌డక్’

Team India

Team India : భారత క్రికెటర్లు శ్రీలంక టూర్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వీరంతా ముంబైలోని స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. సోమవారం వరకు ఈ హోటల్ లోనే ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే బీసీసీఐ, ఆటగాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన స్పెషల్ వంటకాలను తయారు చేయిస్తుంది.

క్రికెటర్ల కోసం ఆదివారం “మాక్‌డక్” అనే వెజిటేరియన్ రెసిపీని ప్రత్యేకంగా తయారు చేయించింది బీసీసీఐ. ఈ వంటకం తయారు చేశారనే విషయాన్నీ వీడియోలో పంచుకున్నారు. చెఫ్ రాకేష్ కాంబ్లే తన సిబ్బందిని పరిచయం చేస్తూ “మాక్‌డక్” ఎలా వండుతారో చూపించారు. దీనిని భారత్ క్రికెటర్లు చాలా ఇష్టంగా తింటారని రాకేష్ తెలిపారు. సంజూ శాంసన్ కు మాక్‌డక్ అంటే చాలా ఇస్తామని, ధావన్ దీనిని రుచి చూసి చాలా బాగుందని తెలిపాడని రాకేష్ వివరించారు.

పాండ్య సోదరులు వారంలో మూడు, నాలుగు సార్లు దీనిని తింటారని వివరించారు. ఇక భారత్ – శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లో జరగనున్నాయి. జులై 13 తేదీ మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. జులై 16 రెండో వన్డే, జులై 18 మూడో వన్డే జరుగుతుంది. అనంతరం జులై 21 నుంచి 25 మధ్య మూడు టి20 మ్యాచ్ లు జరగనున్నాయి.