Delhi Capitals Rainbow jersey: మారిన ఢిల్లీ జెర్సీ.. చెన్నైకు మొద‌లైన టెన్ష‌న్‌..!

అరుణ్ జైట్లీ స్టేడియంలో శ‌నివారం చెన్నై సూప‌ర్ కింగ్స్ తో త‌ల‌ప‌డుతోంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆట‌గాళ్లు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నున్నారు. అదే రెయిన్ బో జెర్సీ.

Delhi Capitals Rainbow jersey: మారిన ఢిల్లీ జెర్సీ.. చెన్నైకు మొద‌లైన టెన్ష‌న్‌..!

Delhi Capitals unveils Rainbow Jersey (photo @DC Twitter)

DC vs CSK: ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్ లీగ్ ద‌శ ముగింపుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. 13 మ్యాచులు ఆడిన ఢిల్లీ ఐదు మ్యాచుల్లోనే గెలుపొంది పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో శ‌నివారం చెన్నై సూప‌ర్ కింగ్స్( Chennai Super Kings) త‌ల‌ప‌డుతోంది ఢిల్లీ. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆట‌గాళ్లు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నున్నారు. అదే రెయిన్ బో జెర్సీ.

ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది. జెర్సీని బ‌హిర్గ‌తం చేసింది. 2020 నుంచి ప్ర‌తీ సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టు ఓ మ్యాచ్‌లో ఈ(రెయిన్ బో) జెర్సీతోనే ఆడుతోంది. 2020, 2021, 2022 సీజ‌న్ల‌లో రెయిన్ బో జెర్సీతో ఆడిన మ్యాచుల్లో ఢిల్లీ విజ‌యం సాధించింది. 2020లో ఆర్‌సీబీతో జ‌రిగిన మ్యాచ్లో 59 ప‌రుగుల‌తో, 2021లో ముంబై పై నాలుగు వికెట్లతో, 2022లో కోల్‌క‌తాపై నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ‌రీ ఈ సాంప్ర‌దాయాన్ని ఈ సీజ‌న్‌లోనూ కొన‌సాగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

KKR vs LSG: కోల్‌క‌తాతో మ్యాచ్‌.. కొత్త జెర్సీలో ల‌క్నో

చెన్నైకి కీల‌కం

ఈ సీజ‌న్‌లో చెన్నై ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా ఓ మ్యాచ్ రద్దు కావ‌డంతో 15 పాయింట్లతో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. అయిన‌ప్ప‌టికీ చెన్నై ప్లే ఆఫ్స్ బెర్తు ఇంకా ఖ‌రారు కాలేదు. ఆఖ‌రి మ్యాచ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా చెన్నై నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ ఓడితే మాత్రం మిగిలిన జ‌ట్లు స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. ఒక‌ర‌కంగా ఇది ధోనిసేన‌కు డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదే.

అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సైతం చెన్నై పై విజ‌యంతో ఈ సీజ‌న్‌ను గెలుపుతో ముగించాల‌ని బావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవ‌కాశం ఉంది.

Virat Kohli: క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే..