India vs Australia T20 Match: రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. స్టేడియంలోకి ఆ వస్తువులు తీసుకెళ్లొద్దు..

ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

India vs Australia T20 Match: రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. స్టేడియంలోకి ఆ వస్తువులు తీసుకెళ్లొద్దు..

Uppal stediem

India vs Australia T20 Match:  ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. స్టేడియంలో దాదాపు 40వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఉంది. అయితే.. ప్రతీఒక్కరూ నిబంధనలు పాటించాలని, అభిమానులు మితిమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Rohit Sharma: టీ20ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఎన్ని సిక్స్‌లు కొట్టాడంటే?

మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభవుతుంది. అయితే, క్రీడాభిమానులకు మధ్యాహ్నం 4.30 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి రూట్‌ను చూపించే యాప్ మెస్సేజ్ వస్తుందని, దీని ద్వారా ఏ గేట్‌కు వెళ్లి వాహనాన్ని పార్కింగ్ చేసుకోవాలో డైరెక్షన్ చూపుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే మ్యాచ్ కు వచ్చేవారు వ్యక్తిగత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ను వినియోగించుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

India vs Australia Match: రేపు భాగ్యనగరంలో భారత్ – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. ఫైనల్ పోరుకు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం..

ఇదిలాఉంటే.. మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంలోకి వెళ్లేవారు హెల్మెంట్, కెమెరాలు, బైనాక్యులర్స్, ల్యాప్‍ట్యాప్‌లు, సెల్ఫీ స్టిక్స్ , బ్లేడ్లు, చాక్ లు, మంచినీటి బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. అదేవిధంగా సిగరేట్లు, తినుబండారాలు, ఆల్కాహాల్, మత్తు పదార్థాలు వంటివి స్టేడియంలోకి అనుమతించరు. స్టేడియం వద్ద ఏడు అంబులెన్స్ లతో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు.