IPL 2022: మార్చి 26 నుంచే ఐపీఎల్

షార్ట్ ఫార్మాట్.. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ 2022 ఆరంభానికి తేదీ ఫిక్స్ అయిపోయింది. మార్చి 26న మొదలై మే29వరకూ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

IPL 2022: మార్చి 26 నుంచే ఐపీఎల్

Ipl 2022

IPL 2022: షార్ట్ ఫార్మాట్.. ప్రపంచంలోనే ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ 2022 ఆరంభానికి తేదీ ఫిక్స్ అయిపోయింది. మార్చి 26న మొదలై మే29వరకూ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 10జట్లు కలిసి ఆడే ఐపీఎల్ 2022వ సీజన్‌లో లీగ్ స్టేజ్ మ్యాచ్ లతో కలిపి 74మ్యాచ్ లు ముంబై, పూణెల్లోని నాలుగు వేదికల్లో జరగనున్నాయి.

బీసీసీఐ సెక్రటరీ జైషా ఐపీఎల్ 2022 షెడ్యూల్ కన్ఫామ్ చేస్తున్నట్లుగా గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఫిక్స్ అయింది.

ఐపీఎల్ ను బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లోనే పూర్తి చేస్తారని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణమైన గాలి ప్రసారం కూడా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలా లీగ్ మ్యాచ్ లపై ఎటువంటి ప్రభావం ఉండదనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఐపీఎల్ 2022 ఫ్రాంచైజీల మొత్తం లోగోలు

(7దేశీ మ్యాచ్ లు, 7విదేశీ మ్యాచ్ లతో కలిపి) మొత్తం 14మ్యాచ్ లు ఆడుతుంది ఒక్కో ఫ్రాంచైజీ. అలా పూర్తిగా 70లీగ్ మ్యాచ్ ల అనంతరం 4ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడనున్నారు. ప్రతి జట్టు 5జట్లతో రెండు సార్లు ఆడుతుండగా మిగిలిన 4జట్లతో ఒక్కోసారి ఆడుతుంది.