Asian Boxing Championship : గంట సేపు గాల్లోనే…భారత బాక్సింగ్ బృందానికి చేదు అనుభవం

భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.

Asian Boxing Championship : గంట సేపు గాల్లోనే…భారత బాక్సింగ్ బృందానికి చేదు అనుభవం

Indian Boxers

SpiceJet Indian Boxers : భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఇంధనం కూడా అయిపోయిందంటూ..‘ఫ్యూయల్ ఎమర్జెన్సీ’గా ప్రకటించడంతో ఆటగాళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు విదేశాంగ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. దీనిపై డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది.

అసలు ఏం జరిగింది ?

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత బాక్సర్లు దుబాయ్ కు వెళ్లాల్సి ఉంది. శనివారం స్పైస్ జెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. సాధారణ ఫ్లైట్ లకు ఆ దేశం అనుమతించడం దీంతో ప్రభుత్వ అనుమతి తీసుకుని భారత బాక్సింగ్ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. కానీ..దుబాయ్ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో సమన్వయం లోపం ఏర్పడింది.

కిందకు దిగే అనుమతులు లభించలేదు. గంట సేపు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానంలో ఉన్న క్రీడాకారులు భయాందోనళలకు గురయ్యారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. చివరకు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. విమానం నుంచి బాక్సర్లు బయటకు రావడానికి గంట సేపు పట్టింది. అన్ని పత్రాలు తనిఖీలు చేయడమే ఇందుకు కారణం. దీని కారణంగా..బాక్సర్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

ఇక టోర్నీ విషయానికి వస్తే..
సోమవారం టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ నుంచి 19 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు. ఇందులో 10 మంది మహిళలు ఉండగా..9 మంది పురుషులున్నారు. మహిళల విభాగంలో మేరీ కామ్‌ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ బరిలో ఉన్నారు.

Read More : Cyclone Yaas : మరో తుపాన్ గండం, తెలుగు స్టేట్స్ కు వర్ష సూచన