T20 World Cup 2022: ఫాంలో లేక విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌కు వసీం జాఫర్ మద్దతు

కేఎల్ రాహుల్ కి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మద్దతు తెలిపారు. ‘‘కేఎల్ రాహుల్ ఉత్తమ ఆటగాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించిన సమయంలో అతడు మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అప్పట్లో అతడికి గాయమైంది. దీంతో వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. దీంతో ఫాంను కొనసాగించడం కొంచెం కష్టం’’ అని అన్నారు.

T20 World Cup 2022: ఫాంలో లేక విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌కు వసీం జాఫర్ మద్దతు

Wasim Jaffer

T20 World Cup 2022: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఓపెనర్ గా క్రీజులోకి వస్తూ ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టకుండా టీమిండియా అభిమానులను అతడు వరుసగా నిరాశ పర్చుతున్నాడు. అయితే, కేఎల్ రాహుల్ కి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మద్దతు తెలిపారు. ‘‘కేఎల్ రాహుల్ ఉత్తమ ఆటగాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించిన సమయంలో అతడు మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అప్పట్లో అతడికి గాయమైంది. దీంతో వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. దీంతో ఫాంను కొనసాగించడం కొంచెం కష్టం’’ అని అన్నారు.

‘‘కేఎల్ రాహుల్ పలుసార్లు గాయపడ్డాడు. అతడు సరిగ్గా రాణించలేకపోతుండడానికి ఇదొక కారణం అయి ఉండొచ్చు. అతడు తిరిగి పుంజుకుంటాడని భావిస్తున్నాను. టెస్టులు, వన్డేలు, టీ20ల్లోనూ అతడు మంచి ఆటగాడు’’ అని వసీం జాఫర్ చెప్పారు.

కాగా, పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో గెలిచేందుకు భారత్ బాగా కష్టపడాల్సి వచ్చిందని, రోహిత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ బాగా రాణించలేపోయారని వసీం జాఫర్ అన్నారు. భారత జట్టు క్రీజులో నిలకడగా రాణించాల్సి ఉందని చెప్పారు. కాగా, టీ20 ప్రపంచ కప్ లో పాక్, నెదర్లాండ్ పై గెలిచిన భారత్ ఎల్లుండి దక్షిణాఫ్రితో తలపడనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..