KL Rahul: కేఎల్ రాహుల్ ఆటతీరుపై మరోసారి మీమ్స్ వెల్లువ

టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలం కావడంతో అతడిపై ట్విట్టర్ లో మళ్లీ ట్రోలింగ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు, రెండో ఇన్సింగ్ లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అతడు ఓపెనర్ గా దిగుతుండడం, అంతగా పరుగులు చేయకుండా ఔట్ అవుతుండడం రొటీన్ అయిపోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

KL Rahul: కేఎల్ రాహుల్ ఆటతీరుపై మరోసారి మీమ్స్ వెల్లువ

KL Rahul

KL Rahul: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలం కావడంతో అతడిపై ట్విట్టర్ లో మళ్లీ ట్రోలింగ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు, రెండో ఇన్సింగ్ లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అతడు ఓపెనర్ గా దిగుతుండడం, అంతగా పరుగులు చేయకుండా ఔట్ అవుతుండడం రొటీన్ అయిపోయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడకపోయినా అతడిని బార్డర్ గవాస్కర్ ట్రోఫీని మిగతా రెండు మ్యాచుల్లో ఆడిస్తుండడం ఆశ్చర్యకరమని అంటున్నారు. కేఎల్ రాహుల్ ను మూడు, నాలుగో టెస్టుల్లో నుంచైనా తీసేస్తారనుకుంటే టీమిండియా స్క్వాడ్ లో మళ్లీ అతడి పేరు కనపడిందని మీమ్స్ సృష్టిస్తున్నారు.

కేఎల్ రాహుల్ ను చాలా సులువుగా ఔట్ చేయవచ్చని, అందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అన్ని మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ 1 పరుగుకే ఔట్ కావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నాడని కొందరు కామెంట్లు చేశారు.