T20 World Cup-2022: మెల్‌బోర్న్‌ చేరుకున్న టీమిండియా.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పెర్త్, బ్రిస్బేన్ తర్వాత ఇప్పుడు టీమిండియా మెల్బోర్న్ లో అడుగుపెట్టిందని పేర్కొంది.

T20 World Cup-2022: మెల్‌బోర్న్‌ చేరుకున్న టీమిండియా.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్‌బోర్న్‌ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పెర్త్, బ్రిస్బేన్ తర్వాత ఇప్పుడు టీమిండియా మెల్బోర్న్ లో అడుగుపెట్టిందని పేర్కొంది.

మొదటి మ్యాచు కోసం ఇక్కడకు చేరుకున్నట్లు తెలిపింది. బ్రిస్బేన్ నుంచి మెల్‌బోర్న్‌ కు టీమిండియా ప్రయాణించిన తీరును చూపింది. పెర్త్ లో టీమిండియా ఒక వార్మప్ మ్యాచ్, బ్రిస్బేన్ లో రెండు వార్మప్ మ్యాచులు ఆడింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ లో జరగాల్సిన ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ లో టీమిండియాను పాక్ ఓడించి దెబ్బ తీసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలబడుతున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..