Apple BKC Store : ఆపిల్ స్టోర్ ఫస్ట్ కస్టమర్‌ కోరిక తీర్చిన టిమ్ కుక్.. 15 గంటల పాటు స్టోర్ బయటే పడిగాపులు..!

Apple BKC Store : ఎట్టకేలకు ముంబైలో ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ (Apple First Retail Store) ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి భారత్‌కు వచ్చిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) స్టోర్ గేటులను తెరిచి కస్టమర్లకు స్వాగతం పలికారు.

Apple BKC Store : ఆపిల్ స్టోర్ ఫస్ట్ కస్టమర్‌ కోరిక తీర్చిన టిమ్ కుక్.. 15 గంటల పాటు స్టోర్ బయటే పడిగాపులు..!

Mumbai man waited 15 hours outside Apple BKC Store, gets his iPod signed by CEO Tim Cook

Apple BKC Store : ప్రపంచ ఐకానిక్ దిగ్గజం ఆపిల్ (Apple) కంపెనీ ఫస్ట్ రిటైల్ స్టోర్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఏప్రిల్ 18 (మంగళవారం) ఉదయం 11 గంటల సమయంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభోత్సవం జరిగింది.

ఈరోజు నుంచి ఆపిల్ రిటైల్ స్టోర్ అమ్మకాలు మొదలయ్యాయి. ఆపిల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు బారులు తీరారు. ముంబై స్టోర్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ తెల్లవారుజామునుంచే ఈ స్టోర్ ముందు పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌కు ఆపిల్ అభిమానులు, టెక్ ఔత్సాహికులు చేరుకున్నారు.

Mumbai man waited 15 hours outside Apple BKC Store, gets his iPod signed by CEO Tim Cook

Mumbai man waited 15 hours outside Apple BKC Store, gets his iPod signed by CEO Tim Cook

Apple BKC స్టోర్ తలుపులు తెరిచిన వెంటనే వెలుపల నిలబడిన వందలాది మంది అభిమానులు, టెక్ ఔత్సాహికులు లోపలికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో కొద్దిమంది కస్టమర్లు మాత్రమే ముందుగా ఆపిల్ స్టోర్‌లోకి ప్రవేశించగలిగారు. ఆ సమయంలో ఆపిల్ సీఈఓతో కలిసి ముచ్చటించారు. ఆ అదృష్టవంతులైన కొద్దిమందిలో ముంబైకి చెందిన పురవ్ అనే వ్యక్తి ఒకరు. ఇతడు గత ముందు రోజు రాత్రి 8 గంటల నుంచి ఆపిల్ స్టోర్ వెలుపల వేచి ఉన్నాడు.

Read Also : Apple First Store In India : ముంబైలో ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించిన టిమ్ కుక్.. కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్..!

స్టోర్ లోపలికి వెళ్లే సమయంలో తన వెంట 10 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన గాడ్జెట్ ఐప్యాడ్ (iPod) కూడా తీసుకెళ్లాడు. లోపలికి వెళ్తున్న సమయంలో అతను టిమ్ కుక్‌ను హగ్ చేసుకున్నాడు. ఆపిల్ స్టోర్‌ని తెరిచిన తర్వాత మొదటిగా ప్రవేశించిన కస్టమర్ పురవ్ కావడంతో కుక్ అతడి కోరికను తీర్చాడు. ముంబై వ్యక్తి తన ఐపాడ్‌ను ఆపిల్ CEO టిమ్ కుక్ చేత సంతకం చేయించుకున్నాడు. తన ఐప్యాడ్‌పై ఆపిల్ సీఈఓతో సంతకం చేయించుకోవాలనే కల నెరవేరడంతో అతడు ఉప్పొంగిపోయాడు.

Mumbai man waited 15 hours outside Apple BKC Store, gets his iPod signed by CEO Tim Cook

Mumbai man waited 15 hours outside Apple BKC Store, gets his iPod signed by CEO Tim Cook

అంత తొందరగా అదృష్టం వరించలేదట.. :
అయితే, ఈ అదృష్టం అంత ఈజీగా అతడ్ని వరించలేదు.. అతని ఇద్దరు స్నేహితుల్లో కార్తీక్ (జోధ్‌పూర్), మాధవ్ (పుణె) ఆపిల్ స్టోర్‌లోకి ప్రవేశించిన మొదటి వారిలో ఉన్నారు. వీరిలో ఎవరు ముందు అని నిర్థారించుకోవడానికి దాదాపు 15 గంటలపాటు స్టోర్ వెలుపల వేచి ఉండవలసి వచ్చింది. ఆ ముగ్గురూ స్టోర్ బయటే రాత్రి బెంచ్‌పై పడుకున్నారు.

రాత్రిపూట భోజనం చేసేందుకు ఫుడ్ డెలివరీ యాప్‌లను కూడా ఉపయోగించారు. తెల్లవారుజామున 4 గంటలకే స్టోర్ బయట బారులు తీరారు. ఆసక్తికరంగా.. ఈ ముగ్గురూ ట్విట్టర్‌ వేదికగా తమ అనుభవాలను ఒకరినొకరు షేర్ చేసుకున్నారు. ‘మేము మొదట ఉదయం 6 లేదా 7 గంటలకు స్టోర్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, అప్పటివరకూ వేచి ఉండలేకపోయాం. అందుకే రాత్రంతా స్టోర్ బయటే ఉండిపోయాం’ అని పురవ్ చెప్పుకొచ్చాడు.

1984 పాత ఆపిల్ కంప్యూటర్‌తో స్టోర్‌కు అభిమాని..
ఆపిల్ అభిమానుల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అభిమాని.. సాజిద్ మొయినుడిన్.. ఇతడు వృత్తిరీత్యా డిజైనర్.. ఉదయం 6 గంటలకే ముంబై స్టోర్ బయట ఉన్నాడు. అయితే, ముఖ్యంగా అతను 1984లో తన మొదటి మెషీన్‌గా కొనుగోలు చేసిన (Macintosh SE) ఆపిల్ కంప్యూటర్‌ని కూడా తనతో తెచ్చుకున్నాడు. టిమ్ కుక్ కూడా పాత Macని చూసి ఆశ్చర్యపోయాడు. సాజిద్ మిషన్‌పై కుక్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.

Apple Fan Brings 1984 Computer To Mumbai Store's Grand Opening

Apple Fan Brings 1984 Computer To Mumbai Store’s Grand Opening

ఇప్పుడు అతడు M1-పవర్డ్ మ్యాక్‌బుక్ ప్రోని ఉపయోగిస్తున్నాడు. ‘ఈ SE మోడల్‌తో నా డిజైన్ ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి నుంచి నేను దానిని దాచి ఉంచుకున్నాను’ అంటూ సాజిద్ మీడియాకు వెల్లడించాడు. ఈ సందర్భంగా పాత ఆపిల్ కంప్యూటర్‌ను చాలా ఎక్కువ ధరకు వేలం వేయగలనని సరదాగా చెప్పాడు. Apple BKC స్టోర్ ఇప్పుడు ఆపిల్ కస్టమర్ల కోసం తెరిచి ఉంది. ఇక, రెండవ ఆపిల్ స్టోర్ ఏప్రిల్ 20న ఢిల్లీలోని సాకేత్‌ (Saket)లో ప్రారంభం కానుంది.

Read Also : Old Apple Computer : ఆపిల్ అభిమాని అంటే.. ఇట్లుంటది మరి.. ముంబై స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్‌కు 1984 ఆపిల్ కంప్యూటర్‌ను తీసుకొచ్చాడు..!