ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, మరొకరి గల్లంతు

ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, మరొకరి గల్లంతు

car crashed into a SRSP canal : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్‌ఆర్ఎస్పీ కాలువలోకి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా… పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి కారు ఒక్కసారిగా దూసుకుపోయింది.

కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో… కారులో నుంచి వెంటనే బయటకు రాలేకపోయారు. చనిపోయిన ఇద్దరూ గుంటూరుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. డ్రైవర్‌కు ఈత రావడంతో పాటు.. స్థానికులు దగ్గర్లోనే ఉండటంతో… డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. తాళ్ల సహాయంతో అతన్ని రక్షించారు.

కారు గ్లాస్ పగులగొట్టుకుని డ్రైవర్ ఈదుకుంటూ.. బయటకు వచ్చాడు. ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాటు..మహిళా టీచర్‌ రేణుకకు ఈత రాకపోవడంతో… కాల్వలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన మరొకరు వినాయకట్రేడర్స్ ఓనర్ శ్రీధర్ గా గుర్తించారు. రెండు మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు.

గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతను కూడా మృతి చెందిఉంటాడని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.