యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది

యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది

A road accident at Jeedimetla : ఓ యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు దాటేప్పుడు ఓ యువకుడి చూపిన అలసత్వం అతడితోపాటు మరో యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. రోడ్డు దాటుతూ మొబైల్‌ చూసుకోవడం ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పదేపదే కోరుతున్నారు. అయినా అటు వాహనదారులు కానీ.. ఇటు పాదచారులుగానీ వారి ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇక్కడ కూడా అదే జరిగింది.

రద్దీ సమయంలో రోడ్డు దాటడమే ఒక తప్పు. వాహనాలు లేవనుకున్నప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. అదీకూడా వెనుకా ముందు చూసుకొని రోడ్డు జాగ్రత్తగా దాటాలి. కానీ యువకుడు వెనుకా ముందు అస్సలు చూసుకోలేదు. రద్దీగా ఉన్న రోడ్డు దాటుతున్నాడు.

పైగా నడిరోడ్డుపై పర్సులో మునిగిపోయారు. పర్సు చూస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఇదే ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో వాహనదారుడి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాహనదారులు బైక్‌లు నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని ట్రాఫిక్‌ పోలీసులు పదేపదే చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్‌ మీ ప్రాణాలను రక్షిస్తుందని మొత్తుకుంటున్నారు.

అయినా ట్రాఫిక్‌ రూల్స్‌ను కొంతమంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హెల్మెట్‌ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఈ ప్రమాదంలో బైక్‌తో ఢీకొట్టిన యువకుడు కూడా హెల్మెట్‌ ధరించలేదు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే హెల్మెట్‌ ధరించి ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదని కాదని అంటున్నారు.