Car Hit Divider : మద్యం మత్తులో డ్రైవింగ్.. డివైడర్ ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.

Car Hit Divider : మద్యం మత్తులో డ్రైవింగ్.. డివైడర్ ను ఢీకొట్టిన కారు

Car Hit Divider : మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని ఎంత చెప్పినా, పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించినా కొంత మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూనేవున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చి పెడుతున్నారు. తప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. కారు దూసుకొస్తుండటంతో భయంతో జనం పరుగులు తీశారు.

Car Accident : మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్.. అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిన కారు

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును అక్కడి నుంచి పోలీసు స్టేషన్ కు తరలించారు. కారు ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.