Bandi Sanjay: కేసీఆర్‌ నీకు ఢిల్లీలో ఏం పని..? ఏం కొంప మునుగుతుందని పోయావ్ ..

అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో ఏం పనిఉందని పోయాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay: కేసీఆర్‌ నీకు ఢిల్లీలో ఏం పని..? ఏం కొంప మునుగుతుందని పోయావ్ ..

Bandi Sanjay and CM KCR

Bandi Sanjay: రాష్ట్రంలో రైతులను కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయని, అకాల వర్షాలతో నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో ఏం పని, ఇక్కడ రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఢిల్లీలో ఏం కొంప మునుగుతుందని పోయావ్ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అకాల వర్షాలకు రైతుల పంటలు దెబ్బతిన్నాయి. పిరికెడు వడ్లు మిగిలే పరిస్థితి లేదు. అధికారులు ఫీల్డ్ విజిట్ చేయరు. అధికారులు తప్పుడు రిపోర్టు చేసిన.. కరెక్ట్ రిపోర్ట్ చేసిన సస్పెండ్ అంటూ బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: నేను సచివాలయం కూలుస్తానని అనలేదు.. పునర్ నిర్మిస్తాం అంటున్నాం ..

150 కోట్లు విడుదల చేస్తామన్నారు. అతిగతి లేదు. సీఎం నోటి నుంచి మాటవస్తే తూచా తప్పకుండా పాటించాలి అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్య‌ల్లో నెంబర్ వన్‌గా ఉందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు ప్రారంభించలేదని, ప్రభుత్వం నిర్లక్ష్య వల్లే రైతులకు ఇబ్బంది తలెత్తుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులు ఏడుస్తున్నరు. వారిని పట్టించుకోవడం లేదు. ఎనిమిదేళ్లలో రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిందంటూలేదు అని కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు. ఫసల్ భీమ ఎందుకు అమలు చేయడం లేదని సంజయ్ ప్రశ్నించారు. సబ్సిడీపై యూరియా, రుణమాఫీ చేస్తామని చెప్పి చేయడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay : అక్కడ కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణ సచివాలయంలో మార్పులు చేస్తాం-బండి సంజయ్

తెలంగాణలో ప్రజా సమస్యలు, అకాల వర్షాలతో రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే.. ఇష్యూ పక్కదారి పట్టించేందుకు నూతన సచివాలయాన్ని ప్రారంభంతో హడావుడి చేశారని సంజయ్ విమర్శించారు. నూతన సచివాలయంలో అన్ని లీకులే. కొత్తగా కట్టిన సచివాలయంలో లీకులు వస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.