నాగార్జునసాగర్‌ బైపోల్‌… జానారెడ్డి కుమారుడుని రంగంలోకి దింపే వ్యూహంతో బీజేపీ!

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 12:46 PM IST
నాగార్జునసాగర్‌ బైపోల్‌… జానారెడ్డి కుమారుడుని రంగంలోకి దింపే వ్యూహంతో బీజేపీ!

BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. సాగర్ బైపోల్ కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. సాగర్ గడ్డపై కొత్తగా జెండా పాతడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ఇచ్చిన బూస్ట్ తో నాగార్జున సాగర్ ను సైతం తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.



దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలతో బీజేపీ మంచి జోష్ లో ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి ఊపిరి పోస్తే..గ్రేటర్ ఫలితాలు ఆ పార్టీని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మార్చేశాయి.

గ్రేటర్ జోష్ ను నాగార్జున సాగర్ లోనూ కంటిన్యూ చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే నాగార్జున సాగర్ లో ధీటైన అభ్యర్థి కోసం సెర్చ్ మొదలు పెట్టింది. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తమతో టచ్ లో ఉన్నాడంటూ లీక్ లు ఇస్తోంది.



ఇక రఘువీర్ కు సాగర్ సీట్ ఇవ్వడంతోపాటు జానారెడ్డికి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ ప్రతిపాదించదని వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నాగార్జున సారగ్ పై కాషాయ జెండా పాతాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం సెర్చ్ మొదలు పెట్టింది.



నాగార్జునసాగర్‌ రాజకీయాలు జానారెడ్డి చుట్టూనే తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బైపోల్‌లోనూ పాలిటిక్స్‌ ఆయన ఇంటి చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో జానా ఫ్యామిలీని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. రఘువీర్‌ను బరిలోకి దించేలా వ్యూహాలు రూపొందిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు రఘువీర్‌లో టచ్‌లోకి వచ్చారు. బైపోల్‌లో బరిలో నిలిపేలా రఘువీర్‌తో మంతనాలు జరుపుతున్నారు.



అయితే రఘువీర్‌ గత ఎన్నికల్లోనే పోటీకి ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో తానే పోటీచేస్తానని జానాపై ఒత్తిడి తీసుకొచ్చారన్న టాక్‌ నడిచింది. దీంతో ఈసారి మాత్రం పోటీచేయాలన్న పట్టుదలతో ఉన్నారు. రఘువీర్‌లో పోటీచేయాలన్న పట్టుదలనే బీజేపీ అవకాశంగా మార్చుకుంటోంది. ఎలాగైనా రఘువీర్‌ను తమ పార్టీ తరపున బరిలోకి దించాలని యోచిస్తోంది. రఘువీర్‌ను బైపోల్‌లో పోటీకి దించేలా వ్యూహాలు రచిస్తోంది.