వైఎస్ షర్మిల టూర్ కు బ్రేక్, కారణం ఏంటీ

వైఎస్ షర్మిల టూర్ కు బ్రేక్, కారణం ఏంటీ

ys sharmilas tour : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఈమె..లోటస్ పాండ్ లో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతరులతో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత..జిల్లాల పర్యటనకు వెళ్లాలని షర్మిల నిర్ణయించారు. తొలుత ఖమ్మం జిల్లాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన టూర్ ఖరారు చేశారు. కానీ..అనూహ్యంగా…ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చి పడింది. దీంతో షర్మిల టూర్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి.

తమకు అనుమతినివ్వాలంటూ…షర్మిల, కొండా రాఘవరెడ్డి డీజీపీని కోరారు. ఈ క్రమంలో వినతిపత్రం ఇచ్చినట్లు సమాచారం. కానీ..ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా సమావేశాలు నిర్వహించకూడదని తేల్చిచెప్పారని తెలుస్తోంది. రాజన్న రాజ్యం కోసం కొత్త రాజకీయ పార్టీకి పునాదులు వేసుకుంటున్న షర్మిల ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు, ఆదివాసీ, గిరిజనులతో షర్మిల మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా..షర్మిల ఖమ్మం టూర్ తాత్కాలికంగా బ్రేక్ పడడంతో వైఎస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పర్యటించాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.