KCR To Buy Aeroplane: విమానం కొనుగోలు యోచనలో సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు..

జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ అవసరాల కోసం 13 సీట్లుండే చిన్న (జెట్) విమానాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

KCR To Buy Aeroplane: విమానం కొనుగోలు యోచనలో సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు..

CM KCR

KCR To Buy Aeroplane: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేగంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల 5న దసరా పండుగ రోజు జాతీయ పార్టీ ప్రకటనతో పాటు పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే జాతీయ పార్టీకి నాలుగు పేర్లు సీఎం కేసీఆర్ పరిశీలించారని, భారతీయ రాష్ట్ర సమితి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. అయితే.. జాతీయ పార్టీ ఏర్పాటు అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు ప్రత్యేక విమానం అవసరమని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో సొంతంగా విమానం కొనుగోలు చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

CM KCR: నేడు యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యం ..

జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ అవసరాల కోసం 13 సీట్లుండే చిన్న (జెట్) విమానాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి రూ. 70 నుంచి 80 కోట్లు నిధులు అవసరం కాగా, పార్టీ ఫండ్ నుంచి వెచ్చించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారట. తెరాసకు విరాళాల రూపంలో ప్రస్తుతం రూ.856 కోట్లు నిధులున్నాయి. మరోవైపు పార్టీ ఫండ్ కాకుండా ప్రత్యేకంగా విమానం కొనుగోలు చేసేందుకు టీఆర్ ఎస్ నేతలు కొందరు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకొని వినియోగిస్తున్నారు. పలు సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జాతీయ పార్టీని స్థాపిస్తే వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేయాలంటే ప్రైవేట్ విమానాల్లో తిరగడం కష్టతరంగా మారుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. సొంత విమానం ఉంటే వేగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేయడంతో పాటు సభలు, సమావేశాలకు సత్వరమే హాజరయ్యే అవకాశం ఉంటుందని భావించి సొంతంగా విమానం కొనుగోలు కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతానికి దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.