CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌.. ఎవ‌రెవ‌రితో భేటీ అవుతారంటే..

జాతీయ రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం క‌ర్ణాట‌క‌కు ఒక‌రోజు ప‌ర్య‌ట‌న కోసం వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానం ద్వారా బ‌య‌లుదేరి బెంగుళూరుకు వెళ్తారు...

CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌.. ఎవ‌రెవ‌రితో భేటీ అవుతారంటే..

Cm Kcr

CM KCR: జాతీయ రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం క‌ర్ణాట‌క‌కు ఒక‌రోజు ప‌ర్య‌ట‌న కోసం వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానం ద్వారా బ‌య‌లుదేరి బెంగుళూరుకు వెళ్తారు. మ‌ధ్యాహ్నం 12గంట‌ల స‌మ‌యంలో మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, ఆయ‌న కుమారుడు , ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమార‌స్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌ధానంగా కేంద్రం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై దేవెగౌడ‌తో చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది.

CM KCR Distribute Cheques : పంజాబ్ రైతులు, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం

రాష్ట్రాల్లో బ‌లం లేక‌పోయినా ఇత‌ర పార్టీల స‌భ్యుల‌ను లోబ‌ర్చుకుని బీజేపీ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయ‌డం వంటి అనైతిక కార్య‌క‌లాపాల అంశం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేసీఆర్ అభిమానులు దేవెగౌడ నివాస ప్రాంతంలో భారీ కౌటౌట్ల‌ను ఏర్పాటు చేశారు. దేవ‌గౌడ‌, కుమార‌స్వామితో రాజ‌కీయ చ‌ర్చ‌ల అనంత‌రం కేసీఆర్ హైద‌రాబాద్ తిరుగుప‌య‌నం అవుతారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో జ‌రిగే మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజ‌ర‌వుతారు.

KCR Delhi Tour Ends : రెండు రోజుల ముందే.. ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

రేపు (శుక్ర‌వారం)సామాజిక ఉద్య‌మ‌కారుడు అన్నా హ‌జారేతో భేటీ కోసం మ‌హారాష్ట్రంలోని రాలేగావ్ సిద్ధికి హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి కేసీఆర్ వెళ్తారు. హ‌జారేతో భేటీ అనంత‌రం షిర్డీలో సాయిబాబా ద‌ర్శ‌నం చేసుకుంటారు. కేసీఆర్ ఈ నెలాఖ‌రులో బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ ప‌ర్య‌టించ‌నుండ‌గా.. ఇంకా షెడ్యూల్ ఖ‌రారు కావాల్సి ఉంది. ఇదిలాఉంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న వేళ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌కు వెళ్తుండ‌టం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ సాంప్ర‌దాయాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. రాష్ట్రానికి ప్ర‌ధాని వ‌స్తే స్వాగ‌తం ప‌ల‌కాల్సిన బాధ్య‌త సీఎం కేసీఆర్ కు ఉంటుంద‌ని, కానీ ప్రొటోకాల్ కు విరుద్ధంగా కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఉంద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.