CM KCR: నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ ఈ రోజు (సోమవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

CM KCR: నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

Telangana National Integration Day

CM KCR: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతూనే ఉంది. జిల్లాల పర్యటనల్లో భాగంగా సీఎం కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన సందర్భంగా నిజామాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలతో జిల్లా కేంద్రం గులాబీ మయమైంది.

CM KCR : మునుగోడు మనదే, బీజేపీకి మూడో స్థానమే! టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1.15గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. 2గంటలకు సీఎం కేసీఆర్ హెలికాపర్ట్ లో నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంకు చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక బస్సులో 2.10గంటలకు ఎల్లమ్మగుట్టలో తెరాస జిల్లా నూతన కార్యాలయం వద్దకు చేరుకుంటారు. 2.30 గంటలకు కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయానికి చేరుకుంటారు. 3గంటలకు కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. 3.05 గంటలకు గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. 4గంటల సమయంలో హెలికాప్టర్ లో హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగు పయణం అవుతారు.

CM KCR: ఎనిమిదేళ్లలో ఒక్క రంగాన్నైనా బాగు చేశారా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారనే అంశంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి పథకాలపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బహిరంగ సభలో కేసీఆర్ ఈ అంశంపై ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు మంత్రి వర్గం, సీఎల్పీ సమావేశాలు తర్వాత పాల్గొంటున్న సభ కావడంతో సీఎం కేసీఆర్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది.