Congress Leaders Padayatra : కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట.. రేవంత్ పాదయాత్రపై సీనియర్లు అసంతృప్తి

కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట మొదలైంది. పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేసే విషయంలో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు.

Congress Leaders Padayatra : కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట.. రేవంత్ పాదయాత్రపై సీనియర్లు అసంతృప్తి

CONGRESS

Congress Leaders Padayatra : కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట మొదలైంది. పాదయాత్రలోనూ ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేసే విషయంలో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పాదయాత్రపై రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అధిష్టానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో గ్రూపుల నేపథ్యంలో పాదయాత్ర విషయంలో ఏఐసీసీ ఆచితూచి అడుగేస్తోంది.

పాదయాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్కను కూడా భాగస్వామ్యం చేసే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.ఇద్దరినీ కలిసి పాదయాత్ర చేయించాలా? లేక విడివిడిగా పాదయాత్రలు చేయించాలా అన్నదానిపై సమాలోచనాలు చేస్తోన్నారు. విడివిడిగా పాదయాత్ర చేస్తే భద్రాచలం నుంచి భట్టి విక్రమార్క, జోగులాంబ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభించే ఛాన్స్ ఉంది.

Manikrao Thakre: మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావ్ థాక్రే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్!

జనవరి 26 నుంచి రేవంత్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. 126 రోజులపాటు పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. రోజుకు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. 99 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా పాదయాత్ర చేపట్టనున్నారు. మరోవైపు సీనియర్లపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీ కోసం ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవికే కాదు.. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని తేల్చి చెప్పారు.