Corona fear : తెలంగాణలో కరోనా భయం..భయం, మళ్లీ పాత రోజులే ?

తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.

Corona fear : తెలంగాణలో కరోనా భయం..భయం, మళ్లీ పాత రోజులే ?

Covid Tg

Telangana : తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పాజిటివ్‌ కేసులు సంఖ్య వెయ్యి దాటేసింది. ఒక్క రోజులోనే వెయ్యి 321 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాతో ఐదుగురు చనిపోయారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7 వేల 923 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 320 మంది కరోనా బారిన పడ్డారు. మేడ్చల్‌లో 114, రంగారెడ్డి జిల్లాలో 121 కరోనా కేసులు బయటపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ప్రచారం చేస్తున్నా కూడా ప్రజల్లో ఏ మార్పూ కనిపించడంలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే గతేడాది జూన్‌-జూలై నాటి రోజులు మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు..దేశంలోనే ఫస్ట్ టైం కరోనా కొత్త కేసుల సంఖ్య 1,03,558 కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా 1, 25,89,067కు కేసుల సంఖ్య చేరింది. కరోనా తీవ్రత ఎక్కువగా మూడు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపినట్టు మోదీ తెలిపారు. ఇక ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్‌ మొదటిస్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌ను బీట్‌ చేసి పడేసింది. ఐదు నెలల తర్వాత అమెరిక, బ్రెజిల్‌ను దాటి భారత్‌లో కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తి దేశంలో ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది.

Read More : Stock Markets : కోవిడ్ దెబ్బకు కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు..