CPI(M) Conference : నేటి నుంచి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు

కరోనా జాగ్రత్తలతో మహాసభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సమావేశ ప్రాంగణంలో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ప్రతినిధులను సభలోకి అనుమతిస్తారు.

CPI(M) Conference : నేటి నుంచి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు

Cpm

CPI(M) Telangana state conference : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఐఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ లో మూడు రోజుల పాటు రాష్ట్ర మహా సభలు జరుగనున్నాయి. ఈ రోజు మహాసభల ప్రతినిధుల సమావేశం జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 700 ప్రతినిధులకు మహా సభలకు ఆహ్వానం అందింది. అయితే కరోనా నేపథ్యంలో మహాసభలకు ఎంత మంది వస్తారో అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.

కరోనా జాగ్రత్తలతో మహాసభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సమావేశ ప్రాంగణంలో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ప్రతినిధులను సభలోకి అనుమతిస్తారు. సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది.

Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

రాష్ట్ర మహాసభల్లో భాగంగా నిన్న ఆన్ లైన్ లో సీపీఐ(ఎం) రాష్ట్ర బహిరంగ సభ జరిగింది. పార్టీ ప్రధాని కార్యదర్శి సీతారాం ఏచూరీ, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, బృందాకరత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకురాలు జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రసంగించారు.