గుమ్మడికాయంత టమోట.. బరువెంతో తెలుసా?

గుమ్మడికాయంత టమోట.. బరువెంతో తెలుసా?

Tomato Weight:టమోటా అంటే ఎంత ఉంటుంది రెండు వేళ్లతో పట్టుకునేంత.. కానీ, ఒక టమోటా బరువవు అర కేజీ అంటే నమ్మగలరా? అవును.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురంలో ఒక తోటలో కాసిన టమోటా సాధారణ బరువు(50 నుంచి 150 గ్రాములు) కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆ టోటలో కాసిన ఈ టమోటా బరువు.. అరకేజీ ఉంది.

మరోవైపు.. పెట్రోల్, డీజెల్ ధరలు పెంపు ప్రభావం కూరగాయల మీద పడుతోంది. మార్కెట్లో కూరాగాయల ధరలు బాగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలతో కూరగాయల వాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఈ భారం ప్రజలపై పడుతోండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటగా.. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే కూరగాయలపై అక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

దక్షిణాదిలో గతేడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిని దిగుబడి చాలా తక్కువగా ఉంది. బెండ, బీన్స్, బీర, బీట్‌రూట్‌ సహా కూరగాయలు దూర ప్రాంతాల నుంచి వస్తుండటం.. రవాణా ఖర్చు ఎక్కువడంతో.. బెండకాయలు, దొండకాయల ధరలు రైతు బజార్లలో కిలో రూ.30 నుంచి రూ.40 వరకూ పలుకుతుండగా బహిరంగ మార్కెట్లలో కిలో రూ.60 వరకూ అమ్ముతున్నారు.

బెండ, దొండకాయల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభించడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడంతో వీటి ధర ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. మరో నెల రోజులపాటు ఇదే పరిస్థితి ఉండవచ్చు. దోసకాయ, చిక్కుళ్లు, క్యాప్సికం ధర కూడా పెరిగింది. రైతుబజార్లలో దోసకాయ కిలో రూ.20లకు, చిక్కుళ్లు, క్యాప్సికం రూ.40కు అమ్ముతున్నారు.