Harish Rao: “హ్యాపీ బర్త్ డే బావా” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. ఓటమి ఎరుగని నేత హరీశ్ రావు

హరీశ్ రావు 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీశ్ రావు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Harish Rao: “హ్యాపీ బర్త్ డే బావా” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. ఓటమి ఎరుగని నేత హరీశ్ రావు

Harish Rao - Kavitha

Harish Rao – Birthday: తెలంగాణ (Telangana) మంత్రి హరీశ్ రావు ఇవాళ 51వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఆయనకు పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే బావా” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ట్వీట్ చేశారు. “థ్యాంక్యూ కవిత” అంటూ హరీశ్ రావు రీట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ ట్వీట్ చేశారు. అలాగే, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హరీశ్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం, తోటపల్లి గ్రామంలో 1972 జూన్ 3న జన్మించారు.

ఓటమి ఎరుగని నేత
హరీశ్ రావు రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు. 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీశ్ రావు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 1,20,650 మెజార్టీ వచ్చింది. సిద్ధిపేట పేరు వినబడితే మొదట గుర్తుకు వచ్చేది హరీశ్ రావు.

MLC Kavitha: సీఎం కేసీఆర్ వల్లే ఇవి సాధ్యమయ్యాయి: ఎమ్మెల్సీ కవిత