Heat Waves : కరోనా చాలదన్నట్టు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Heat Waves : కరోనా చాలదన్నట్టు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

Heat Waves

Heat Waves : అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని వివరించారు.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జనాలు విలవిలాడిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎండలో బయట తిరగకపోవడమే మంచిదని డాక్టర్లు అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా వెంట వాటిర్ బాటిల్ ఉంచుకోవడం బెటర్ అంటున్నారు. తగినంత నీరు తాగుతూ ఉండాలని డాక్టర్లు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్స్ ధరించాలని, గొడుగులు వాడాలని జాగ్రత్తలు చెప్పారు. ఈ సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో తగినంత నీరు తీసుకోవాలన్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదన్నారు.