Kadiyam Fire on Etela : ఏం ఉద్ధరించటానికి ఈటల బీజేపీలో చేరారు? : కడియం శ్రీహరి

Kadiyam Fire on Etela : ఏం ఉద్ధరించటానికి ఈటల బీజేపీలో చేరారు? : కడియం శ్రీహరి

Kadiyam srihari criticism On Etela : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ నేత తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ నేతలు ఈటలపై మాటల తూటాలు సంధించటం మాత్రం మానలేదు. ఈక్రమంలో టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మాట్లాడుతూ..ఈటలకు బీజేపీలో చేరిన రోజునే అవమానం జరిగిందని..అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా ఈటల బీజేపీలో చేరతారని వార్తలు వచ్చిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలోనే బీజేపీలోకి చేరటంపై కడియం శ్రీహరి జేపీ నడ్డా చేతులమీదుగా ఎందుకు బీజేపీలోకి చేరలేదు? అదే ఆయనకు బీజేపీలో చేరిన రోజునే ఎదురైన పరాభం అని ఎద్దేవా చేశారు. ఆయన స్థాయిని తెలిపే ఘటన అది అన్నారు.

ఏం ఉద్ధరించటానికి ఈటల బీజేపీలో చేరారు? నేను కమ్యూనిస్టు విలువలు కలిగిన వ్యక్తిని అని చెప్పుకునే ఈటల కమ్యూనిస్టు భావజాలం ఎక్కడకు పోయింది.బీజేపీలో చేరేటప్పుడు ఆయనకు సిద్ధాంతాలు,కమ్యూనిస్టు భావజాలం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.గౌవరం ఇచ్చిన పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు ఈటలకు కనీస గౌరవం కూడా దక్కలేదనీ..బీజేపీలో చేరిన రోజే ఈటెలకు దక్కిన పరాభవం చూస్తుంటే నాకు జాలి వేస్తోందని అన్నారు. బీజేపీలో మీకు ఎటువంటి సిద్దాంతాలు నచ్చి వెళ్లారనీ..ఆ విధానాలు ఏంటో ప్రజలకు తెలిపాలని డిమాండ్ చేశఆరు. ఈటల బీజేపీలో చేరింది ఆ పార్టీ విధానాలు నచ్చి కాదు..కేవలం ఆయనపై నమోదు అయ్యి కేసుల నుంచి తప్పించుకోవటానికి మాత్రమేనని విమర్శించారు.

బీజేపీ ప్రజలను నమ్ముకొని పరిపాలన చేయడంలేదు.. కేవలం కులలను,మతాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. ఆ కులమతాల సెంటిమెంట్ తో బీజేపీ లబ్ధిపొందుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ఆకలితో వలస కూలీలు అల్లాడిపోయారు. అటువంటి సమయంలో కూడా మోడీ ప్రభుత్వం పేదల కోసం ఏం చేసింది? బలహీన వర్గాల పొట్టగొడుతున్న బీజేపీలో ఏం చూసి చేరావో ప్రజలకు తెలిపాలని ఈటలపై విమర్శల వర్షం సంధించారు కడియం.నీలో ఉన్న కమ్యూనిస్టు.. సోషలిస్టు చచ్చిపోయాడా? బీజేపీ చేరడానికి ఆ భావజాలాన్ని చంపేసుకున్నావా? అని తీవ్రంగా ప్రశ్నించారు. బీజేపీ మనుషుల మధ్య మత విద్వేషాలు, మత ఘర్షణలు సృష్టించి బ్లాక్ మెల్ చేసే పార్టీ..అటువంటి పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అది నీకు కనిపించలేదా? ఈ. డీ దాడులతో దేశంలో గుత్తాదిపత్యం చేలాయిస్తున్న పార్టీలో ఏ మొఖం పెట్టుకొని చేరావ్ అంటూ ఈటలపై విరుచుకుపడ్డారు కడియం శ్రీహరి.

బీజేపీలో ఉండే ఫ్యూడల్ వ్యవస్థ నీకు కనిపించడం లేదా? గడీలను మించిన నీ ప్యాలెస్, వేల కోట్ల విలువ కలిగిన భూ కబ్జాలు చేసిన నువ్వు ఏ సోషలిస్టు భావాల గురించిమాట్లాడుతున్నావు? అసైన్డ్ భూములు, ఆలయ భూములు కొన్నానను నువ్వే చెప్పు కున్నావ్. ఆ విషయాన్ని నువ్వే ఒప్పుకున్నావ్…అది చట్ట వ్యతిరేకమని నీకు తెలియదా? అలా చట్ట చట్ట వ్యతిరేకంగా కొన్న భూముల్ని ప్రభుత్వానికి అప్పగించడం లేదు? వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటుంటే ఎందుకు అడ్డు పడుతున్నావ్. ఆస్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నావ్..ఇన్ని చేసి కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తిని అని ఎలా చెప్పుకుంటున్నావ్. అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఈటెల తనకు తానుగా రాజీనామా చేయలేదు..బర్తరఫ్ చేసిన తర్వాతే బీజేపీ లో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఆత్మగౌరవం అంటూ మాట్లాడే ఈటలకు ఆత్మాభిమానం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇంతకాలం 26లక్షల రూపాయల రైతుబంధు తీసుకున్నప్పుడు నీ ఆత్మాభిమానం ఎక్కడ పోయింది? అప్పుడు గుర్తు రాలేదా? ఆత్మగౌవరం? నీ నిజస్వరూపం..నీ నిజాయితీ ఏపాటిదో ప్రజలు గుర్తిస్తున్నారు.

బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.. జాతిని ముక్కలు చేసే దౌర్భాగ్యపు పార్టీలో చేరావ్..ఇక నీకు అవమానాలే తప్ప అందలాలు ఉండవని గుర్తుంచుకో వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీని ఓడించడం కోసం బీజేపీ తోడేళ్ళలా మూకుమ్మడి దాడి చేస్తే ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారని అన్నారు. తెలంగాణ ను హస్తగతం చేసుకోవడం బీజేపీ పన్నాగాలు తెలంగాణ ప్రజల ముందు పనిచేయవని అన్నారు. బీజేపీ పన్నాగాలు తెలంగాణలో సాగవని గుర్తుంచుకోవాలని..ఇక్కడ జిమ్మిక్కులు చేస్తే బీజేపీ ముక్కు మూతి పగలడం కాయం అని అన్నారు కడియం. -తెలంగాణ లో బీజేపీ ఉనికేలేదు..ఇక తెలంగాణ లో కాంగ్రెస్ ఎప్పుడో కనుమరుగై పోయింది.. మరో 20 ఏళ్ల వరకు ఏకైక బాహుబలి కేసీఆర్ ఒక్కరే..పాలన చేస్తారని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.