జోలికి, కయ్యానికి రావొద్దు : apex council meeting జల వివాదాలపై KCR పక్కా ప్లాన్

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 07:56 AM IST
జోలికి, కయ్యానికి రావొద్దు : apex council meeting జల వివాదాలపై KCR పక్కా ప్లాన్

kcr apex council meeting : మళ్లీ మన జోలికి రావొద్దు.. కయ్యానికి కాలు దువ్వొద్దు.. వాస్తవాలేంటో కుండబద్ధలు కొట్టాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం ముందున్న టార్గెట్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీన కేంద్రం అపెక్స్ (Apex) కౌన్సిల్ నిర్వహిస్తోందీ. దీంతో.. ఏపీ మరోసారి తెలంగాణ జోలికి రాకుండా ఉండేందుకు కేసీఆర్ (KCR) పక్కాగా ప్లాన్ వేస్తున్నారు.



తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీకి కసరత్తు చేస్తున్నారు. కౌన్సిల్ ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని.. ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అపెక్స్ కౌన్సిల్ ముందు గట్టిగా చెప్పాలని నిర్ణయించారు.



ఇటీవల ఏపీ తెలంగాణ మధ్య జల జగడాలు ముదురుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతోంది. తమ కేటాయింపులకు అనుగుణంగానే ఎత్తిపోతల చేపట్టామని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, దేవాదుల, తుపాకుల గూడెం, చరఖా-కొరాట, రామప్ప, ప్రాణహిత తదితర ప్రాజెక్టుల‌ను ఏపీ వ్యతిరేకిస్తోంది.



ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దిగువన ఉన్న తమ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నది ఏపీ వాదన. అయితే.. రాయలసీమ ఎత్తిపోతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెబుతోంది. విభజన చట్టానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వ్యతిరేకమని.. తాము పాత ప్రాజెక్టులనే రీ-డిజైన్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల జల వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.



జల వివాదంపై ఏపీ, తెలంగాణ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో.. కేంద్రం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో… అక్టోబర్ ఆరున జరిగే సమావేశంలో ఎలాంటి వాదనలు వినిపించాలనే విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.



గురువారం మధ్యాహ్నం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన డేటా తీసుకుని రావాలని అధికారులను సిఎం ఆదేశించారు. దీంతో.. అధికారులంతా కృష్ణా నీటి పంపకాలు, నీటి వాడకంపై డేటా రెడీ చేస్తున్నారు.



ఏపీ కావాలనే కయ్యానికి కాలు దువ్వుతోందని సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. మళ్లీ ఏపీ తెలంగాణ జోలికి రాకుండా ఉండేలా గట్టిగా ఆన్సర్ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఇటీవ‌ల కృష్ణా, గోదావ‌రి న‌దీ యాజ‌మాన్య బోర్డుల స‌మావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు త‌మ వాదాన‌లు వినిపించారు. అయిన‌ప్పటికీ ఈ వివాదం కొలిక్కి రాలేదు. అయితే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనైనా నీటి పంచాయితీ ప‌రిష్కారం అవుతుందా లేదా చూడాలి.