Jagga Reddy: కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు నష్టం లేదు.. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారు: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు నష్టం లేదు.. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారు: జగ్గారెడ్డి

Jagga Reddy: ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని, ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రేను జగ్గారెడ్డి గురువారం కలిశారు. ఆయనతో అనేక అంశాలపై చర్చించారు.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ సందర్భంగా ఇటీవల కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి జగ్గారెడ్డి స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మర్యాద పూర్వకంగానే ఠాక్రేను కలిశా. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలిశా. ఠాక్రేతో జరిగిన భేటీలో రాజకీయాలపై చర్చించాం.

Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా

బీఆర్ఎస్, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతల గురించి ఠాక్రేకు వివరించా. అంతర్గత విషయాలపై మాట్లాడలేదు. మాణిక్ రావు ఠాక్రే అనుభవం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. తెలంగాణలో 70 స్థానాల్లో విజయం కోసం కృషి చేస్తాం. చాలా మంది సీనియర్లు పాతయాత్ర చేస్తున్నారు. త్వరలోనే నా పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి వెల్లడిస్తా’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

జగ్గారెడ్డి తర్వాత మరో కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా ఠాక్రేను కలిశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్రలపై, వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోపై చర్చించినట్లు ఆయన తెలిపారు. తన పాదయాత్రకు సంబంధించిన వివరాల్ని కూడా మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. వచ్చే మార్చి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పారు.