Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నారు.

Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు

Madhuyashki

Madhuyashki letter Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నారు. అన్ని పదవులు పొంది రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీన పర్చాలని చూసినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రం చేరదీసి దగ్గరకు తీసుకుని కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి ఎంతోమందిని నాయకులను, ముఖ్యమంత్రులను, కేంద్ర-రాష్ట్ర మంత్రులను, గవర్నర్లు, ఏఐసీసీ, పీసీసీ అధక్షులుగా పదవులిచ్చిందని గుర్తుచేశారు.

సోనియాగాంధీకి 1991లోనే ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా.. తాను తప్పుకుని పీవీ నరసింహారావుగారిని ప్రధానిని చేశారని పేర్కొన్నారు. యూపీఏ -1 లో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం, రైతు రుణమాఫీ, సమాచార హక్కుచట్టం, ఐటీ, టెలికామ్ రెవెల్యూషన్, సివిల్ న్యూక్లియర్ డీల్, ఇతర సంక్షేమ పథకాల అమలు వల్ల, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో యూపీఏ – 2 ఏర్పడిందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నాయకుడిగా, బీసీ బిడ్డ డీ.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా, రెడ్డి-బీసీ కలయికతో సోనియాగాంధీ నాయకత్వాన 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గానూ 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధిభి మోగించిందని చెప్పారు.

Congress Party: సమూల మార్పులు దిశగా కాంగ్రెస్ పార్టీ: సంస్థాగత ఎన్నికలపై కసరత్తు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమేనని స్పష్టం చేశారు. బహుశా మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ చారిత్రక విషయాలను మీకు తెలియజేస్తున్నాను అని మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాల చేతిలో అణగారిన వర్గాలు, బహుజనులు బలవుతున్న విషయాన్ని గుర్తించి, బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు వనురుల పంపిణీ సమానంగా జరుగుతుందని, ప్రభుత్వంలోభాగస్వామవుతారని ఆలోచన చేశారని పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం అన్నారు. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో మీరంతా ‘‘మా రెడ్లకిందనే పనిచేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’’ అంటూ చేసి వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో అన్ని పార్టీలకు రెడ్లు మాత్రమే నాయకత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.