Harish Rao Jobs : ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ, త్వరలో 50వేల పోస్టులు

నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు.

Harish Rao Jobs : ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ, త్వరలో 50వేల పోస్టులు

Harish Rao Jobs

Harish Rao Jobs : నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు.

గురువారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాశరథి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ”ఇప్పటివరకు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాము. కొత్తగా 64 వేల ఉద్యోగాలు సృష్టించాం. ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటరన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరువు అనేది లేకుండా పోయింది. నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయి. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో నిలిచాం” అని మంత్రి హరీశ్‌ అన్నారు.

పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, జిల్లా లైబ్రరీని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తానని భరోసా ఇచ్చారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే ఉద్యోగార్థులకు కోసం జిల్లా లైబ్రరీలో 50 కుర్చీలతో కూడిన వసతి కల్పించినట్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దాశరథి పాటలు, ఆయన రాసిన కవిత్వం వింటుంటే అమృత ధారలు కురిసిన విధంగా మంచి అనుభూతి పొందినట్లు మంత్రి చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, పీడిత ప్రజల పక్షాన పోరాడినట్లు చెప్పుకొచ్చారు. దాశరథి కలలుగన్న వారి ఊహాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.