Ministar KTR: నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. కొస్గీలో భారీ పోలీస్ బందోబస్తు..

ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరక్రద నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 2గంటలకు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గీ మున్సిపాలిటీలో ..

Ministar KTR: నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. కొస్గీలో భారీ పోలీస్ బందోబస్తు..

Ministar KTR:ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరక్రద నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 2గంటలకు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గీ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని మంత్రి ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ వెంట ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు పాల్గొంటారు.

Minister KTR : బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్..నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు

మంత్రి కేటీఆర్ పర్యటన ఇలా..
– శనివారం ఉదయం 10గంటలకు దేవరకద్ర మండలం వెంకంపల్లికి మంత్రులు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడే రూ.55 కోట్ల నిధులతో పేరూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి భూమిపూజ చేస్తారు.
– 10.30 గంటలకు అడ్డాకుల మండలం వర్నెలో రూ.10కోట్లతో వర్నె- ముత్యాలంపల్లి గ్రామాల మధ్యన వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
– 11 గంటలకు గుడిబండలో రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
– 11.15 నిమిషాలకు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మినీ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
– ఉదయం 11.45 గంటలకు భూత్పూర్ లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అదేవిధంగా భూత్పూర్ పరిధిలోని తండాలకు రూ.12కోట్లతో బీటీ నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు.
– మధ్యాహ్నం 12గంటలకు భూత్పూర్ పరిధిలోని అమిస్తాపూర్ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభిస్తారు. అనంతరం అమిస్తాపూర్ వద్ద బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంటకు మూసాపేట మండలం వేములలోని కోజెంట్ కంపెనీ వద్ద 5వ యూనిట్ ను ప్రారంభించి దివ్యాంగులకు స్కూటీలను మంత్రులు పంపిణీ చేస్తారు.
– మధ్యాహ్నం 2గంటల నుంచి సాంయత్రం 4:30 గంటల వరకు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొస్గీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
– సాయంత్రం 4:30 గంటలకు కొస్గీ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 5:30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు పయణం అవుతారు.

Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్‌ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబ‌డులు

ఇదిలాఉంటే దేవరకద్ర నియోజకవర్గం, కొస్గీ మున్సిపాలిటీలో మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొస్గీ మున్సిపాలిటీ కొడంగల్ నియోజకవర్గంలో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన టీపీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యాడు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది. ఈ క్రమంలో కొస్గీలో మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు సుమారు 800 మందితో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు.