Minister Talasani : గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని

గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తుచేశారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలని తెలిపారు.

Minister Talasani : గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని

Talasani

Minister Talasani Srinivas : తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. రాజ్ భవన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అవసరమే లేదన్నారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తుచేశారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలని తెలిపారు. గవర్నర్ దర్బార్ పెడితే గెలిచిన వాళ్లు ఎక్కడికి వెళ్లాలని చెప్పారు. తమ పరిధిలో తామే మాట్లాడుతున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. ఇటీవలే ప్రధాని మోదీతో తమిళిసై భేటీ అయ్యారు. తెలంగాణలో చోటుచేసుకొన్న పరిణామాలపై కూడా ప్రధానికి తమిళిసై వివరించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తూనేవున్నారు. ఇటీవల రాజ్ భవన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది.  టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్ పర్యటనలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు.

Satyavathi Rathod: గవర్నర్ తమిళిసై ఆంతర్యం ఏంటో అందరికి అర్ధం అవుతుంది: మంత్రి సత్యవతి రాథోడ్

ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్ పర్యటనల్లో మంత్రలు దూరంగా ఉంటున్నారు. దీంతో గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గవర్నర్ తమిళిసై కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నేను ఎవరికి తలవంచబోనని..కానీ రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తాను’ అని ఇటీవల గవర్నర్ తమిళసై వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీతో చర్చించే సమయంలో ఇవన్నీ ప్రస్తావనకు తెచ్చి ఉంటారనే అందరూ భావిస్తున్నారు.

2022 జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా సీఎం కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని, ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి.

TS Governor Tamilisai : ‘మహిళా గవర్నర్ ని అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు’

రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు. ఈ సంబరాలకు సీఎం కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపారు. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.