MLC Elections : సెప్టెంబర్ లోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..!

తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

10TV Telugu News

MLC elections : తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సివుండగా కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

కరోనా కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పుడు అనువైన సమయం కాదని సీఎస్ పేర్కొన్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు చేపట్టాలని కోరారు. దీంతో నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశ మిగిలింది.

ఇప్పటికే జూన్ 3న ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. పదవీకాలం పూర్తైన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యా సాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీద్దున్, ఆకుల లలిత ఉన్నారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన తెలంగాణ భవన్ ఇంచార్జీ ఎం.శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం జూన్ 16 నాటికి ముగిసింది.

10TV Telugu News