MP Arvind: చట్టాన్ని గౌరవిస్తాం అన్నవాళ్లు సుప్రీం కోర్టుకు ఎందుకెళ్లారు.. కవిత తీరుపై అరవింద్ విమర్శలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక్కు. బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. కవిత విచారణ కోసం రేపు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అందరూ ఢిల్లీ వస్తారా?

MP Arvind: చట్టాన్ని గౌరవిస్తాం అన్నవాళ్లు సుప్రీం కోర్టుకు ఎందుకెళ్లారు.. కవిత తీరుపై అరవింద్ విమర్శలు

MP Arvind: ఈడీ విచారణ నుంచి మినహాయింపు కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరుపై విమర్శలు గుప్పించారు. ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు.

Madhya Pradesh: బోరుబావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం

‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక్కు. బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. కవిత విచారణ కోసం రేపు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అందరూ ఢిల్లీ వస్తారా? ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాలున్నాయి. ఢిల్లీ పదేపదే వస్తే.. కెమెరాలో రికార్డు అవుతారు. తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయా? ఇటీవల సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తాం అంటున్నారు.

మరి తెలంగాణలో ప్రస్తుతం 33 శాతం రిజర్వేషన్ ఉందా? ఒక పక్క లింగ సమానత్వం అంటూనే, మరోపక్క ఈడీ విచారణకి మహిళలను మినహాయించాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్లారు? కవిత విచారణకు వెళ్తుంది. తెలంగాణ మంత్రులు ఢిల్లీ రాకుండా, వారి పని వారు చూసుకోవాలి. దొంగలు, దోపిడీదారులు ఒక్కటై ఈడీ కార్యాలయానికి వెళ్తున్నారు’’ అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.