Mrigasira : ముంగిళ్లు తడిపే మృగశిర కార్తె..చేపల కోసం మార్కెట్ కు క్యూ కట్టిన జనాలు

ఎండలు మండే రోహిణి కార్తె వెళ్లిపోయింది. చల్ల చల్లని మృగశిర కార్తె వచ్చింది. అంతే జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు. మృగశిర కార్తె వస్తే .. చిరు జల్లులతో ముంగిళ్లు తడుస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినే సంప్రదాయం కొనసాగుతోంది. ఈక్రమంలో జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు.

Mrigasira : ముంగిళ్లు తడిపే మృగశిర కార్తె..చేపల కోసం మార్కెట్ కు క్యూ కట్టిన జనాలు

Mrigasira Karthi 2021 Special Ramnagar Fish Market Rush

Mrigasira Karthi 2021: ఎండలు మండే రోహిణి కార్తె వెళ్లిపోయింది. చల్ల చల్లని మృగశిర కార్తె వచ్చింది. అంతే జనాలు చేపల మార్కెట్ కు క్యూ కట్టారు. మృగశిర కార్తె వస్తే ముంగిళ్లు తడుస్తాయని అంటారు. చిరు జల్లులతో ముంగిళ్లు తడుస్తాయి. ఈ క్రమంలో మృగశిర కార్తె రోజు చేపలు తినే సంప్రదాయం కొనసాగుతోంది. ఈక్రమంలో హైదరాబాద్ లోని రామ్ నగర్ చేపల మార్కెట్ కు నగరవాసులు క్యూ కట్టారు. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయింది, సాధారణంగా సండే వచ్చిందంటే చాలు రామ్ నగర్ చేపల మార్కెట్ లో జనాలు భారీగా ఉంటారు. అదే మరి మృగశిర కార్తె వస్తే చేపలు తినకుండా ఉంటారా? సమస్యే లేదు. అందుకే చేపల మార్కెట్ లకు జనాలు భారీగా క్యూ కట్టారు. దీంతో పోలీసులు రామ్ నగర్ మార్కెట్ సమీపంలోకి వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించారు. కరోనా లేదు..గిరోనా లేదు అన్నట్లుగా భారీ తరలి వచ్చిన జనాలతో రామ్ నగర్ ఫిష్ మార్కెట్ రద్దీగా ఉంది.

మృగశిర వచ్చిదంటే చాలు కార్తె ప్రవేశం రోజు ప్రతి ఇంటా (నాన్ వెజ్ తినేవారు) చేపల కూర ఘుమ ఘుమలు గుప్పుమంటాయి. ముఖ్యంగా కొర్రమీను చేపను కొనుక్కుని చక్కగా కూర వండుకుని మరీ లాగించేస్తుంటారు. మృగశిర కార్తె వస్తోంది అంటేనే చేపల వ్యాపారాలు ముందుగానే కొర్రమీనును స్టాక్ పెట్టుకుంటారు. ఒక్కరోజునే భారీ ధరలకు అమ్ముకుంటారు. దీంతో కొర్రమేను చేప రేటు చుక్కలనుంటుంది. సాధారణ రోజుల్లో కిలో కొర్రమీను చేప రూ.300లు ఉంటుంది. కానీ మృగశిర కార్త సందర్బంగా ఆరేటు డబుల్, ట్రిపుల్ కూడా అవుతుంది. కానీ రేటు ఎంతైనా తగ్గిదే లే అంటారు జనాలు. కొర్రమీనును కొనుక్కుని తిని తీరుతారు. ఎందుకంటే అది సంప్రదాయం అంటారు. సంప్రదాయం పక్కన పెడితే మృగశిర కార్తె రోజు ఆ తరువాత రెండు రోజులు చేపలు తింటే ఆరోగ్యం.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం రెండు ముక్కలైనా నోట్లో వేసుకుంటారు. మరికొంతమంది చేపలతో పాటు రొయ్యలు. పీతలు కూడా తింటారు. అలా మృగశిర వస్తే రైతన్నలకు పండుగే పండుగ. జగతికి కొత్త ఆశలను మోసుకొచ్చే పండుగే ఉగాది జూన్ 8 మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్లు.రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. జూన్ 8వ తేదీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ కార్తె మొదటి రోజుకి ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ చేపలు తినడం , చేప మందులు తినడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

మృగశిర కార్తె రోజున ఆస్తమా బాధితులకు చేపమందు వేయటం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎన్నాళ్లుగానే కొనసాగుతోంది. మృగశిర కార్తె రోజున చేపలు కానీ ఎందుకు తింటారు దీని వెనక ఉన్న ఆరోగ్యరహస్యం ఏంటి నేటి యువతకు అస్సలు తెలియదు. ఆ రహస్యం ఏంటంటే ఈ కార్తెలో ఎక్కువగా మనిషి శరీరంలో మార్పులు జరిగి, ఎక్కువ మంది వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంది. వీటిని అరికట్టేం సుగుణం చేపల్లో ఉంది అందుకే మృగశిర కార్తె రోజున చేపలుతినాలనే సంప్రదాయం వస్తోంది.