KTR on Moinabad Farmhouse Row: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం’పై స్పందించిన మంత్రి కేటీఆర్

తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా తాము మాట్లాడబోమని చెప్పారు. తొందర పడవద్దని తమ పార్టీ నాయకత్వానికి తాను చెప్పానని అన్నారు. సమయానుసారం సీఎం కేసీఆర్ అన్ని విషయాలపై మాట్లాడతారని అన్నారు. కొందరు ప్రమాణాలు చేస్తామని అంటున్నారని, ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇక పోలీసులు ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు.

KTR on Moinabad Farmhouse Row: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం’పై స్పందించిన మంత్రి కేటీఆర్

KTR on Moinabad Farmhouse Row: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం’పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా తాము మాట్లాడబోమని చెప్పారు. తొందర పడవద్దని తమ పార్టీ నాయకత్వానికి తాను చెప్పానని అన్నారు. సమయానుసారం సీఎం కేసీఆర్ అన్ని విషయాలపై మాట్లాడతారని అన్నారు. కొందరు ప్రమాణాలు చేస్తామని అంటున్నారని, ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇక పోలీసులు ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు సరికాదని, ఉప ఎన్నిక వేళ మునుగోడులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందని ఆయన నిలదీశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న జూటా, జుమ్లా బీజేపీపై ఛార్జిషీట్’’ విడుదల చేశారు. బీజేపీ వ్యక్తిగత నిందారోపణలు చేస్తోందని, దివాళాకోరు రాజకీయాలను మునుగోడు ప్రజలు ఒప్పుకోరని అన్నారు.

అసత్యాలు చెబుతున్న బీజేపీని బహిరంగంగా ఎండగట్టడానికే తాము చార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసిందో ఎన్నికల సమయంలో చెప్పాల్సి ఉంటుందని, తాము ఏం చేశామో స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. తాము మునుగోడులో గెలిస్తే చేయబోయే పనులు కూడా చెబుతున్నామని అన్నారు.

జేడీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ కేంద్రాన్ని పెడతానన్నారని, బయ్యాం ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాటమార్చిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ధాన్యం కొనాలని చెబితే నూకలు తినాలని చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.155 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. రూపాయి విలువ రోజురోజుకీ పతనం అవుతోందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..