Tree Isolation : ఒకరు చెట్టుపై, మరొకరు బాత్‌రూమ్‌లో.. కరోనాను జయించేందుకు కొత్త మార్గం

అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్‌ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10 రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. మరో 4 రోజుల్లో కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Tree Isolation : ఒకరు చెట్టుపై, మరొకరు బాత్‌రూమ్‌లో.. కరోనాను జయించేందుకు కొత్త మార్గం

Tree Isolation

Tree Isolation : అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్‌ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10 రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. మరో 4 రోజుల్లో కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఆ యువకుడి పేరు శివ. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండలో ఉంటాడు. అతడికి కరోనా సోకింది. ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. అయితే అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము. మరి ఐసోలేషన్ లో అంటే ఎక్కడ ఉండాలనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో ఇంటి ముందున్న చెట్టు కనిపించింది. అంతే, దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టి అక్కడే ఉంటున్నాడు. మొత్తంగా ఆ యువకుడి ఐడియా కరోనాపై జయించేలా చేసింది.

ఇక వికారాబాద్ జిల్లా మైలాపూర్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ వ్యక్తి ఇంట్లో వసతి లేకపోవడంతో బాత్ రూమ్ నే గదిగా మార్చుకున్నాడు. అందులోనే ఐసోలేషన్ లో ఉంటున్నాడు. అందులో ఉండటం ఇబ్బందే అయినా, కుటుంబసభ్యుల కోసం తప్పదని చెబుతున్నాడు.

కరోనా వచ్చిందని కంగారు పడలేదు. ఇంట్లో వసతి లేదని బెంగ పెట్టుకోలేదు. మనసుంటే మార్గం ఉందని ఈ వ్యక్తులు నిరూపించారు. ధైర్యంగా ఉండాలే కానీ ఎంతటి రోగాన్నైనా అలవోకగా ఎదుర్కోవచ్చని వీరు నిరూపించారు.