మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త

మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త

digital-india-under-attacka

new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపారు. ఫోన్లకు మెసేజ్ లు పంపి చీట్ చేస్తున్నారు.

తాజాగా, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ లు ప్రజలను భయపెడుతున్నాయి. వాస్తవానికి ఇవి ఫేక్ మెసేజ్ లు. సైబర్ క్రిమినల్స్ పంపిస్తున్నారు. ముందుగా మీ ఫోన్ కి ఓ మెసేజ్ వస్తుంది. మీ నెంబర్ బ్లాక్ కాకుండా ఉండాలంటే మాకు ఫోన్ చేయాలని అందులో చెబుతారు. అంతేకాదు కస్టమర్లతో ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నారు. దాన్ని డౌన్ లోడ్ చేశారో ఇక అంతే. ఖేల్ ఖతం దుకాణం బంద్. దీని ద్వారా కస్టమర్ల బ్యాంక్, ఆధార్, పాన్ నెంబర్లు సేకరించి ఖాతాల్లోని డబ్బు కొట్టేస్తున్నారు.

ఈ తరహా ఘటనలు వెలుగులోకి రావడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫేక్ మెసేజ్ లను నమ్మొద్దన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా కేర్ ఫుల్ గా ఉండాలన్నారు.