Gandhi లో Oxygen కొరత..రోగి మృతి, లాస్ట్ కాల్ మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి

  • Published By: madhu ,Published On : July 16, 2020 / 09:19 AM IST
Gandhi లో Oxygen కొరత..రోగి మృతి, లాస్ట్ కాల్ మాటలు వింటే కన్నీళ్లు వస్తాయి

గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్‌ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్‌ కొరత వల్ల శ్రీధర్‌ చనిపోయాడని.. శ్రీధర్‌ పట్ల ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

చివరిసారిగా శ్రీధర్ బంధువుతో మాట్లాడిన కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏం మాట్లాడారంటే : –

శ్రీధర్‌, పేషెంట్‌ : అన్నా నేను శ్రీధర్‌ని.. శ్రీధర్‌ బంధువు : ఆఆ. శ్రీధర్‌, పేషెంట్‌ : అన్నా.. ఈ గాంధీలో ఏం పట్టించుకోవడం లేదన్నా. శ్రీధర్‌ బంధువు : ఆఆ.. శ్రీధర్‌, శ్రీధర్‌, పేషెంట్‌ : నైట్‌ నుంచి ఒక దుప్పటి.. బెడ్‌షీట్‌ ఇచ్చినరు. ఆయాసం పెరుగుతుంది, తగ్గుతుంది అని చెప్తె.. అది అంతే అని సతాయిస్తున్నరు. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా.. నాతో కావట్లేదు ఇంకా. శ్రీధర్‌ బంధువు : సరే సరే.. ఇప్పుడే నేను మినిస్టర్‌ గారితో చెప్పిస్తా. మినిస్టర్‌తో చెప్పించి ఏదో ఒకటి చేస్త నేను.. సరేనా..

శ్రీధర్‌, పేషెంట్‌ :
చెప్తున్నా కానీ అసలు పట్టించుకోవడం లేదు వీళ్లు. శ్రీధర్‌ బంధువు : సరే సరే.. మినిస్టర్‌తో చెప్పించి ఏదో ఒకటి చేస్త నేను.. నువ్వు ధైర్యంగా ఉండు. శ్రీధర్‌, పేషెంట్‌ : సరే అన్నా..
శ్రీధర్‌ బంధువు : శ్రీధర్‌.. వార్డు నెంబర్‌ ఎంత. శ్రీధర్‌, పేషెంట్‌ : వార్డు నెంబర్‌ ఏ ఇచ్చిండ్రు అనుకుంట అన్నా. శ్రీధర్‌ బంధువు : ఏ నా…శ్రీధర్‌, పేషెంట్‌ ఆఆ.. ఏ నే అనుకుంటా..

శ్రీధర్‌ బంధువు : బెడ్‌ నెంబర్‌ ఎంత.. వస్తున్నం మేము వస్తున్నం.. ఆడ గడబిడ చేసే వాళ్ల సంగతి చెప్తం కానీ..నేను స్వరూప వస్తున్నం..బెడ్‌ నెంబర్‌ ఏమైన ఐడియా ఉందా.. తెలవకపోయినా పర్లేదు.

శ్రీధర్‌, పేషెంట్ : లేదన్న. శ్రీధర్‌ బంధువు : ఇప్పుడు అక్కడ ఆక్సిజన్‌ ఎవరికీ పెట్టలేదా ? శ్రీధర్‌, పేషెంట్ : పెట్టలేదు.. పెట్టినా కానీ ఆక్సీజన్‌ అయిపోయింది అన్నరు. శ్రీధర్‌ బంధువు : ఔనా.. సరే సరే. వస్తున్నం వస్తున్నం మేము.. ఇప్పుడే బయల్దేరి.

శ్రీధర్‌, పేషెంట్ : ఆఆ అన్నా. శ్రీధర్‌ బంధువు : ఏం కంగారు పడకు.. ఏమవ్వదు దేవున్ని మొక్కుకో. అందరి కోసం.. పిల్లల కోసం నువ్వు మంచిగా ఉంటావ్‌..  శ్రీధర్‌, పేషెంట్ : సరే అన్నా. శ్రీధర్‌ బంధువు : ఏమవ్వదు గుర్తుపెట్టుకో.. 55 ఏళ్లు దాటినోళ్లకే కష్టం.. మేమొస్తున్నం ఇప్పుడే సరేనా.

శ్రీధర్‌, పేషెంట్ : సరే ఓకే అన్నా.