Pm modi: నేడు రాష్ట్రానికి ప్ర‌ధాని మోదీ.. రెండున్న‌ర గంట‌లు ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇలా..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేడు హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు రాష్ట్ర రాజ‌ధానిలో ప‌ర్య‌టిస్తారు. ప్ర‌ధాని రాక సంద‌ర్భంగా అధికారులు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. భార‌త వాయుసేన‌కు చెందిన ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యంలో మోదీ దిగింది మొద‌లు తిరిగి చెన్నై వెళ్లే వ‌ర‌కూ...

Pm modi: నేడు రాష్ట్రానికి ప్ర‌ధాని మోదీ.. రెండున్న‌ర గంట‌లు ప‌ర్య‌ట‌న‌.. షెడ్యూల్ ఇలా..

Pm Modi

Pm modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేడు హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు రాష్ట్ర రాజ‌ధానిలో ప‌ర్య‌టిస్తారు. ప్ర‌ధాని రాక సంద‌ర్భంగా అధికారులు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. భార‌త వాయుసేన‌కు చెందిన ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యంలో మోదీ దిగింది మొద‌లు తిరిగి చెన్నై వెళ్లే వ‌ర‌కూ ప్ర‌తి అంశాన్ని పోలీసులు కూలంకుశంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌ధానికి అపూర్వ స్వాగ‌తం ప‌లిప‌కేలా బీజేపీ రాష్ట్ర నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేశారు. న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్స‌వంలో ప్ర‌ధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.

PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్‌ చెక్కపెట్టె’ గురించి తెలుసా

ఇదిలా ఉంటే ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం భారీ ఏర్పాట్లు చేసింది. కేంద్రంలో కాంగ్రెసేత‌ర ప్ర‌ధానిగా ఎనిమిదేళ్ల పాల‌న‌ను పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భంగా మోదీకి అపూర్వ‌మైన రీతిలో స్వాగ‌తం ప‌లికేందుకు బీజేపీ నేత‌లు ఏర్పాట్లు చేశారు. ప్ర‌త్యేక విమానంలో మ‌ధ్యాహ్నం 1.25 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌యానికి వ‌చ్చే మోదీకి రాష్ట్ర ముఖ్య నాయ‌కులు స్వాగ‌తం ప‌లుకుతారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన వేదిక‌పై నుంచి భారీగా త‌ర‌లివ‌చ్చే కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌కు మోదీ అభివాదం చేస్తారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇక్క‌డి వారిని ఉద్దేశించి మోదీ ప్ర‌సంగిస్తార‌ని స‌మాచారం. ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సుమారు 1,500 మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మోదీ ప‌ర్య‌టించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
ప్ర‌ధాని మోదీ షెడ్యూల్‌..
– మ‌ధ్యాహ్నం 1.25 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రి త‌ల‌సాని, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, సీఎస్ సోమేష్ కుమార్‌, డీజీపీ, మేయ‌ర్ ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లుకుతారు.
– బేగంపేట నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ లో బ‌య‌ల్దేరి 1.50గంట‌ల‌కు హెచ్ సీయూ క్యాంప‌స్ లో దిగుతారు.
– అక్క‌డి నుండి ప్ర‌త్యేక వాహ‌నంలో 2గంట‌ల‌కు ఐఎస్‌బీకి చేరుకుంటారు.
– 3.15 గంట‌ల దాకా ఐఎస్‌బీ వార్సికోత్స‌వం, స్నాత‌కోత్స‌వంలో పాల్గొంటారు. అనంత‌రం ప్ర‌సంగిస్తారు.
– 3:20 గంట‌ల‌కు ఐఎస్‌బీ నుంచి బ‌య‌లుదేరి 3:30 కు హెచ్‌సీయూకు వ‌స్తారు.
– 3:50 గంట‌ల‌కు బేగంపేట‌కు చేరుకొని 3:55 గంట‌ల‌కు విమానంలో చెన్నైకి తిరుగు ప‌య‌నం అవుతారు.