Revanth Reddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై రేవంత్ రెడ్డి స్పందన

అధికారం కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ లో నెలకొందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Revanth Reddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy

Revanth Reddy – YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరే విషయంపై టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని ఆమెనే అడగాలని అన్నారు.

పొత్తులు అనేది కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల అంశం అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వివరించారు. అధికారం కోల్పోతామనే భయం సీఎం కేసీఆర్ లో నెలకొందని రేవంత్ రెడ్డి చెప్పారు.

అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఏం చెప్పినా ప్రజలు నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి కేసీఆర్ కు లేదని తెలిపారు.

ముఖ్యమంత్రి ఎవరు?
కేసీఆర్ ముఖ్యమంత్రా? కేటీఆర్ ముఖ్యమంత్రా? అనే విషయంపై బీఆర్ఎస్ పార్టీలో స్పష్టత లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారని చెప్పారు.

తమ పార్టీలో మాత్రం ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, కేటీఆర్ కు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి అప్పజెబుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?