Ponnala Lakshmaiah: దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న అనుభవం ఎంత?: పొన్నాల

పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన "బంగారు భారత్" నినాదం అత్యంత హాస్యాస్పదం గా ఉందని ఎద్దేవా చేసారు.

Ponnala Lakshmaiah: దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న అనుభవం ఎంత?: పొన్నాల

Ponnala

Ponnala Lakshmaiah: తెలంగాణలో “జాతీయ రాజకీయాల” చర్చ వాడివేడిగా కొనసాగుతుంది. “జాతీయ ప్రత్యామ్న్యాయ కూటమి” అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. మంగళవారం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పిన “బంగారు భారత్” నినాదం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. కేసీఆర్ తెలిసీతెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నాడని పొన్నాల దుయ్యబట్టారు. “కూట్లో రాయి తీయాలేని వాడు .. ఏట్లో రాయి తీస్తా అన్నట్లు ఉంది” అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు స్నాదించారు పొన్నాల. తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలను, పోరాటాలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించింది కాక .. ఇప్పుడు దేశాన్ని బ్రష్టు పట్టిస్తనంటున్నాడని..తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

Also read: BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఓ బ్రమగా వర్ణించిన పొన్నాల లక్ష్మయ్య.. దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత? అని సూటిగా ప్రశ్నించారు. తన ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రోజెక్టునైనా కేసీఆర్ పూర్తి చేశారా? అంటూ ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఏకరాకైనా నీళ్ళు ఇచ్చాడా అని పొన్నాల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్న నీచమైన చరిత్ర కేసీఆర్ దని, రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ ఇప్పుడు దేశం వైపు చూస్తున్నాడని పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

Also read: High Court : కార్మికులకు పరిహారం ఇచ్చారా? లేదా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కేసీఆర్ నక్కజిత్తుల మాటలకు కాలం చెల్లిపోయిందని.. ఆయన నిజస్వరూపం ఇప్పుడిపుడే ప్రజలకు అర్థం అవుతోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇక దేశ రాజకీయాలపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ పై విమర్శలు చేశారు. “సైకిల్- టెర్రరిస్ట్” అంటూ సమాజ్ వాదీ పార్టీనుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని పొన్నాల అన్నారు. దేశ ప్రధానిగా పనిచేస్తున్నవారు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్నికలు ఉన్నాయి కదా అంటూ ఏది పడితే అది మాట్లాడటం నేతలకు మంచిదికాదని సూచించారు.

Also readPresidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సీఎం నితీష్.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం!