Tank Bund : సన్ డే – ఫన్ డే, సమయంలో మార్పులు..ట్రాఫిక్ ఆంక్షలు

2021, సెప్టెంబర్ 26వ తేదీ...ఆదివారం మధ్యాహ్నం 03 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Tank Bund : సన్ డే – ఫన్ డే, సమయంలో మార్పులు..ట్రాఫిక్ ఆంక్షలు

Sunday

Sunday – Fun Day : నగరానికి మణిపూస ట్యాంక్ బండ్. ఇక్కడ నిలబడి నగర అందాలను తిలకించడానికి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. వీకెండ లో ఈ రష్ ఎక్కువగా ఉంటంది. కానీ..వాహనాల రష్, రణగొనుల మధ్య..ఆహ్లాదంగా ఉండలేకపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ సిటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్యాంక్ బండ్ ట్రాఫిక్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ మళ్లించేందుకు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

దీంతో నగర ప్రజలే కాకుండా..ఇతర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు. వీరికి మరింత ఫన్, ఎంజాయ్ కల్పించేందుకు వినోద కార్యక్రమాలు, హస్తకళల స్టాల్స్, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ రెస్పాండ్ వచ్చింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గత నెల 29వ తేదీ నుంచి ట్యాంక్ బండ్ పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అనుమతినిస్తున్నారు. వీకెండ్ ఆదివారం సాయంత్రం వేళల్లో పిల్లా..పాపలతో పెద్దలు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

Read More : Tank Bund : సండే-ఫన్ డే బ్యాక్..ఏ కార్యక్రమాలుంటాయో తెలుసా ?

అయితే…మరింత సమయం కేటాయిస్తే..ఎలా ఉంటుందనే దానిపై అధికారులు ఆలోచించారు. హచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చర్చించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండం, ఆదివారం పగటి వేళల్లో కూడా మరింత సమయం ట్యాంక్ బండ్ పై గడిపేందుకు అవకాశ: ఉంటుందని నిర్ణయించారు. దీంతో…మధ్యాహ్నం 03 గంటల నుంచి…రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలపై నిషేధం విధించారు. ఈ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు.

 

2021, సెప్టెంబర్ 26వ తేదీ…ఆదివారం మధ్యాహ్నం 03 గంటల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్ పార్కు వరకు, ఇప్పటికే పార్కింగ్ స్థలాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇతర వాహనదారులు మూడు గంటల నుంచి ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.